బుల్లితెర ప్రేక్షకులకు చలాకీ చంటి పరిచయం అవసరం లేని పేరు. జబర్దస్త్ షోతో పాపులర్ అయిన కమెడియన్స్ లో చలాకి చంటి కూడా ఒకరు. వాస్తవానికి తెలుగు ఇండస్ట్రీలో జబర్దస్త్ కామెడీ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇప్పటికీ ఎప్పటికీ ఈ షో అనేది ఎవర్ గ్రీన్. తెలుగులో ఓ రియాలిటీ కామెడీ షో ఇంతగా సక్సెస్ అవుతుందని వాళ్లు కూడా ఊహించి ఉండరు. ఇలా ఈ ఫ్లాట్‌ఫామ్ ద్వారా చంటి కమెడియన్ గా మంచి గుర్తింపు పొందాడు. జబర్డస్త్ తీసుకు వచ్చిన పాపులారిటీతో చలాకి చంటి పలు చిత్రాల్లో అవకాశాలు అందుకున్నాడు.
అలాగే జబర్దస్త్ షోతో పాటు అనేక కార్యక్రమాల్లో యాంకరింగ్‌గా కూడా చేస్తున్నాడు చంటి. ఇక ఈ మధ్య కాలంలో చంటికి అవకాశాలు బాగా తగ్గాయి. అయితే మళ్లీ పుంజుకుని ప్రస్తుతం మంచి జోరు మీద ఉన్నాడు చంటి. సహజంగా బోల్డ్ గా మాట్లాడే స్వభావం ఉన్నవాడు చంటి. అన్ని విషయాలలో ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాడు. ఇవి అందరికి తెలిసిందే. మరి ఈ చలాకీ చంటి జబర్దస్త్ కామెడీ షోకు రాకముందు ఏం పని చేసేవాడు..? అసల ఎలా జబర్దస్త్ షోకు పరిచమయ్యాడు..? అన్న ప్రశ్నలు మీకు ఏదో ఓ సందర్భంలో వచ్చే ఉంటాయి.
జబర్దస్త్ షోకు రాకముందు చలాకీ చంటి ఎఫ్ఎం రేడియోలో పనిచేసేవాడు. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కూడా నటించారు. ఇక అక్కడ నుంచి జబర్దస్త్ కామెడీ షోతో మంచిగా పాపులర్ అయ్యాడు ఈయన. కాగా, ఈఒక్క షో వల్ల ఎంతో మంది జీవితాలు ఒక్కసారిగా తిరిగాయి. బాగా డబ్బులు సంపాధించుకుని సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ముఖ్యంగా కూలీ స్థాయి నుంచి ఈ రోజు లక్షలు సంపాదించే స్థాయికి ఎదిగారు కూడా. హోటల్లో కప్పలు కడుక్కునే స్థాయి నుంచి అదే హోటల్‌కు చీఫ్ గెస్టులుగా వెళ్లే స్థాయికి ఎదిగారు.