చైనాతో పాటు అక్కడి నుండి మరికొద్ది దేశాలకు కూడా ప్రబలించి…. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి విధంగా అంతు చిక్కకపోవడంతో శాస్త్రవేత్తలు మరియు మేధావులంతా తలలు పట్టుకున్నారు. వైరస్ మనిషి నుంచి మనిషికి చాలా తేలికగా సోకడం వల్ల ఇది అత్యంత ప్రమాదకరమైనది గా శాస్త్రవేత్తలు మరియు వైద్య నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలో మొట్టమొదటి సారి దీని ఆచూకీని చైనా నుండి తిరిగి వచ్చిన ఒక కేరళ స్టూడెంట్ వద్ద చూడగా హైదరాబాదులో కూడా కరోనా వైరస్ కేసులు ఇప్పటికి ఒక 10 వరకు నమోదయ్యాయి. అయితే వైరస్ ఎలా వచ్చింది అన్న విషయం పై ఇప్పుడిప్పుడే శాస్త్రవేత్తలు ఒక అంచనాకు వచ్చారు.

 

నిఫా వైరస్ మాదిరిగానే కరోనా వైరస్ యొక్క పుట్టుక గబ్బిలాల నుంచే అన్నది వారి అంచనా. కరోనా వైరస్ ను మైక్రోస్కోప్ ద్వారా పరీక్ష చేసినప్పుడు దీనిలో గబ్బిలంలో మామూలుగా నివసించే కామన్ వైరస్ యొక్క జీనోమ్ ఆకృతికి 88% మ్యాచ్ అయినట్లు తెలిసింది. చైనాలో మొట్టమొదటిసారి గుర్తించబడిన వైరస్ పొందిన మొదటి ఎనిమిది మంది చైనాలోని వుహాన్ జంతువుల మార్కెట్ కి వెళ్ళిన వారే కావడం గమనార్హం. ఇకపోతే వుహాన్ మార్కెట్ లో గబ్బిలాలను విక్రయిస్తారు. అయితే కరోనా.. గబ్బిలం నుండి మాత్రమే ఇది సోకెందుకు అవకాశాలు తక్కువ, మరి వైరస్ ఎలా వ్యాప్తి చెంది ఉంటుంది?

 

చెట్టు మీద నివసించే గబ్బిలాలను పాములు ఎంతో ఇష్టంగా తింటాయి. ఊహాన్ మార్కెట్ లోని సీ ఫుడ్ తో పాటు పాములను కూడా జోరుగా విక్రయిస్తారు. పాము మాంసం చైనీయులకు ఎంతో ఇష్టం. ఇక వారు తాము రక్తాన్ని గ్లాసులో వేసి కొన్ని నీళ్లు తాగినట్లు గటగటా తాగేస్తున్నారు. కాబట్టి గబ్బిలాలకు పాములకు వీటికి ఇంటర్మీడియట్ హోస్టుల లాగా పని చేశాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. పాము కాకపోయినా గబ్బిలం కు మనిషికి మధ్య ఉన్న ఏదో ఒక జంతువు ద్వారానే వైరస్ వారికి సోకింది అని అభిప్రాయం. ప్రస్తుతానికైతే కరోనా వైరస్ ప్రబలడంతో మార్కెట్ ను మూసివేశారు. కాబట్టి మీరు కూడా వీలైనంతగా గబ్బిలాలకు మరియు పాములకు దూరంగా ఉండడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: