యువ హీరోలంతా ఇప్పుడు మంచి ఫాం లో ఉన్నారని చెప్పొచ్చు. వారిలో ఎనర్జిటిక్ స్టార్ ఇస్మార్ట్ హిట్ తో సూపర్ జోష్ లో ఉన్నాడు. పూరి డైరక్షన్ లో రాం హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ రాం కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ బొమ్మ అయ్యింది. ఆ సినిమా తర్వాత రాం సినిమాల సెలక్షన్స్ పంథా మార్చుకున్నాడు. ప్రస్తుతం కిశోర్ తిరూమల డైరక్షన్ లో రెడ్ సినిమా చేస్తున్నాడు రాం. ఈ సినిమా కోలీవు సూపర్ హిట్ మూవీ తడం కు అఫిషియల్ రీమేక్ గా వస్తుంది. సినిమా మొదలుపెట్టిన రోజే ఫస్ట్ లుక్ తో చింపేసిన రాం సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.

 

ఇక ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవుతుంది అమృతా అయ్యర్. సినిమా నుండి హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ చూసిన తెలుగు ప్రేక్షకులు రాం రెడ్ సినిమాలో సమంత నటిస్తుందా అన్నంతగా షాక్ అయ్యారు. అమృతా అయ్యర్ సమంతకు జిరాకా కాపీలా ఉంది. ఏమాయ చేసావే సినిమాలో చబ్బీ చబ్బీగా ఉన్న సమంతలా అమృతా అయ్యర్ లుక్స్ ఇంప్రెస్ చేశాయి. రెడ్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న ఈ అమ్మడు ఆల్రెడీ తమిళంలో మూడు సినిమాలు చేసింది.

 

పడై వీరన్, కాలి, బిగిల్ ఈ మూడు సినిమాల్లో హీరోయిన్ గా కాకుండా సెకండ్ హీరోయిన్ గా చేస్తూ వచ్చిన అమృతా అయ్యర్ టాలీవుడ్ లో హీరోయిన్ గా ప్రమోట్ అయ్యింది. ఇలియానా నుండి కీర్తి సురేష్ వరకు రాం సినిమాతో ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో టాప్ రేంజ్ కు వెళ్లిన భామలు ఉన్నారు. కాబట్టి ఈ జూనియర్ సమతకు రాం లక్ కలిసి వస్తుందని చెప్పొచ్చు. రెడ్ సినిమాలో మరోసారి రాం సీరియస్ లుక్ తో కనిపిస్తున్నాడు. ఆల్రెడీ తమిళంలో హిట్టైన సినిమా కాబట్టి తెలుగులో కూడా అదే రిజల్ట్ వస్తుందని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: