సైన్స్ ప్రకారం సూర్యుడు ఒక గ్రహం మాత్రమే అంతరిక్షంలో సూర్యుడు లాంటి గ్రహాలు ఇంకా చాలాచాల అనంత విశ్వంలో ఉన్నాయి అన్న విషయాలు నిరూపించబడినా మన హైందవ సంస్కృతిలో సూర్యుడు ను ఆదిత్యుడుగా ఆరాధిస్తూ పూజలు చేయడం మన సంప్రదాయం. వేదాలలో సూర్యుడు కి చాల ప్రాముఖ్యత ఉంది. ఆదిత్యహృదయం సాటిలేని మంత్రం. ఆదిత్య హృదయాన్ని నిష్టగా పారాయణం చేయడం ద్వారా  ద్వారా ఆరోగ్యం ఐశ్వర్యంతో పాటు విజయం కూడా వస్తుంది. 


హిందువులకు ప్రత్యక్ష దైవంగా కీర్తింపబడుతున్న సూర్యభగ వానుడి వైభవాన్ని ప్రపంచానికి వెల్లడించే అద్వితీ యమైన రోజు రథసప్తమి. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచం లోని అనేక దేశాలలో జగతికి వెలుగులు ప్రసాదించే దేవుడిని దైవంగా భావిస్తారు. సూర్యుడిని ఆదిత్య రవి భాస్కర ఆర్క దివాకర వంటి నామాలతోపిలుస్తారు. హైందవ సంప్రదాయం ప్రకారం రథసప్తమికి ఎనలేని ప్రాధాన్యత ఉంది.

 

కాల మానం ప్రకారం సూర్యుడు ప్రతిసంవత్సరం ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కుకు ప్రయాణి స్తాడని శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి దీనినే ఉత్తరాయణం అంటారు. అత్యంత ప్రాముఖ్యమైన స్థానంలో సూర్యుడు ఆకాశ మార్గంలో దేదీప్యమానంగా వెలుగుతున్నందున నవగ్రహాలలో ముఖ్యుడిగా ఉంటూ వస్తున్నాడు.
తొమ్మిది గ్రహాలను కలిపి నవగ్రహాలుగా పిలుపబడతాయి. నవగ్రహాల మధ్యలో సూర్యుడికి ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. వేల సంవత్సరాలకు పూర్వమే ఈ విషయాన్ని పూర్వీకులు అనేక హిందూ శాస్త్రాలలో వెల్లడించారు. సూర్య దేవాలయాలలో ఆంధ్ర ప్రదేశ్‌లోని శ్రీకాకుళం అరసవల్లిదేవాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. 


ఆరోగ్య ప్రదాతగా సూర్యుభగవానుడు ప్రాణకోటి మనుగడకు వెలుగు ఇవ్వడంతో పాటు ఆరోగ్య ప్రదాతగా సూర్యుడికి కోట్లమంది ప్రజలు పూజిస్తూ ఉంటారు. సూర్య కిరణాల ప్రాణకోటిలో శక్తిని ఉత్పత్తి చేసేందుకు దోహదం చేస్తాయని నిరూపించబడింది. వీటి ద్వారా శరీరానికే కాకుండా మనసుకు కూడా పరిశుభ్రత ఏర్పడుతుంది. సూర్య ఆరాధన వల్ల ఐశ్వర్యంతో పాటు విజయం కూడా వస్తుంది. ఈరోజున సూర్యుడుకి ఇష్టమైన ఎర్ర చందనం ఎర్రనిపూలతో సూర్యుడిని అర్చించాలి. చిక్కుడు జిల్లేడు రేగు ఆకుల్లో సౌరశక్తి ఉంటుంది కాబట్టి ఈరోజు చేసే పూజలో ఈ ఆకులను వినియోగిస్తారు. ఈరోజు సమస్త జగతికి మూలాధారమైన ఆదిత్యుడు ని ఆరాదించిన వారందరికీ సకల విజయాలు ప్రాప్తిస్థాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: