సంక్రాంతి ఫెస్టివల్‌ అంటే కొత్త సినిమాలకు పండగే.. ఈ రోజుల్లో కుటుంబ సమేతంగా సినిమాలకు వెళ్లడం పండగలో ఒక భాగమైపోయింది. అందువల్ల సంక్రాంతి బరిలో సినిమాలను నిలపాలని దర్శక నిర్మాతలు ఆలోచిస్తారు. ఇకపోతే ఈసారీ అదే జరిగింది. ముందుగా వచ్చిన తమిళ డబ్బింగ్ సినిమా దర్బార్ హిట్ టాక్ తెచ్చుకొని... సంక్రాంతికి గుడ్ ఓపెనింగ్ ఇచ్చింది. ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు మూవీ సరిలేరు నీకెవ్వరూ... మాస్ ఆడియన్స్‌కి తెగ నచ్చేసింది. ఫలితంగా కలెక్షన్లు కుమ్మేస్తోంది అనే టాక్‌ను సొంతంచేసుకుంది.

 

 

ఆ తర్వాత వచ్చిన అల వైకుంఠపురంలో సినిమా కూడా రిలీజ్ అయ్యి ఊహించన దానికంటే ఎక్కువగానే విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన ఎంత మంచివాడవురా.. ఎలా వచ్చించిందో అంతే మంచిగా సైడ్ అయిపోయింది. ఇక ముందుగా వచ్చిన రజనీ సినిమా దర్భార్ ఫర్వాలేదనిపించింది. 

 

 

ఇక టాలీవుడ్‌లో పోటీగా ఈ రెండు సినిమాలే మిగిలాయి. అయితే బహూబలి సినిమా రాకముందు సినిమా హిట్ అయితే ఒక అడ్రస్ లేకుండా ఆ సినిమా హిట్ అనుకునే వారు. ఎప్పుడైతే బాహుబలి వచ్చిందో, అప్పటి నుండి టాలీవుడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ఏ సినిమా రిలీజ్ అయినా బాహుబలి సినిమాను క్రాస్ చేసిందంటూ, లేదా క్రాస్ చేస్తుందంటూ ప్రచారం కొనసాగిస్తున్నారు.

 

 

ఇలాంటి ప్రచారాలకు స్టార్ హీరోల సినిమాలు కూడా దాసోహమైయ్యాయి. అందుకు ఉదాహరణ సరిలేరు నీకెవ్వరూ.. అల వైకుంఠపురం లో ఈ రెండు చిత్రాల మధ్య ఎంతగా పోటీ నెలకొంది అంటే మా సినిమా ఇన్ని వసూలు సాధించిందని ఒకరంటే, దానికి మూడాకులు ఎక్కువే చదివినట్టుగా సొంత డబ్బాలు కొట్టుకోవడం మొదలు పెట్టారు చిత్రబృందం. అసలు వసూళ్లు ఎంతున్నాయో తెలియదు గాని, బాహుబలి రికార్డ్స్‌ను వీళ్లే బలవంతంగా దాటించేలా ఉన్నారు. నిజంగా సినిమాలో అంత దమ్ముంటే వీళ్లు బలవంతంగా బహూబలి రికార్డ్స్‌ను తిరగరాయడానికి ప్రయత్నించవలసిన అవసరం లేదు. ప్రేక్షకులే బ్రహ్మ రధంపట్టి వసూళ్లను పెంచుతారు.

 

 

నిజంగా సిగ్గుపడే విషయం ఏంటంటే ఒక సినిమా  హిట్ అనే పేరు తీసుకురావడానికి ఇంతలా ప్రయత్నించడం మన టాలీవుడ్ చిత్రపరిశ్రమకు మాత్రం సొంతం అని ఇప్పటికే పరభాష చిత్రరంగం వారు అనుకుంటున్నారట.. సొంత డబ్బా మంచిదే కాని నవ్వులపాలు అయ్యే విధంగా పళ్లన్ని బయటపడే విధంగా ఇలా బజాయించడం బాగోలేదనే టాక్ చాటుగా వినిపిస్తుందట..  

 

 

ఇకపోతే నైజాం ఏరియాలో బాహుబలి 1 చిత్రం లాంగ్ రన్ లో దాదాపుగా 43 కోట్ల షేర్ ను వసూళ్లు చేసింది. ఇప్పటి వరకు అల వైకుంఠపురంలో చిత్రం దాదాపుగా 40.75 కోట్ల షేర్ తో మూడవ స్థానంలో ఉంది. ఈ వీకెండ్ లో కాస్త ఎక్కువ ప్రమోట్ చేయడం వల్ల ఆ రెండున్నర కోట్ల వసూళ్లు దక్కించుకుని బాహుబలి 1 రికార్డును బ్రేక్ చేయాలని వైకుంఠపురంలో టీం ఆశపడుతోంది. అందుకోసం ప్రయత్నాలు ముమ్మరం చేసిందట...

మరింత సమాచారం తెలుసుకోండి: