పొలిటికల్ రంగం నుండి సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత 'ఖైదీ నెంబర్ 150', 'సైరా' సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్ హిట్లు చిరంజీవి అందుకొన్నాడు. చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ స్థాయిలో తెరకెక్కిన ‘సైరా’ దేశవ్యాప్తంగా గత ఏడాది దసరా పండుగ సందర్భంగా అనేక భాషలలో విడుదల అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే ఆ సినిమా ఇచ్చిన విజయంతో నెక్స్ట్ వెంటనే కొరటాల శివ సినిమా స్టార్ట్ చేసిన చిరంజీవి ఆ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఇటీవల మొదలుపెట్టారు. అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే చిరంజీవి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో సినిమా తీయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. గతంలోనే చిరంజీవి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఆటో జానీ’ అనే సినిమా చేయడానికి రెడీ అయినట్లు అయితే ఆ సినిమా ఫస్టాఫ్ కథ బాగున్నా గని సెకండాఫ్ లో ఏమాత్రం స్టోరీ లేకపోవడంతో డ్రాప్ అయిపోయారు చిరంజీవి.

 

అయితే అనేకసార్లు పూరి జగన్నాథ్ ...మెగాస్టార్ తో సినిమా చేయాలని తన డ్రీమ్ అని బహిరంగంగానే చెప్పడం జరిగింది. అయితే ఆటో జానీ మధ్యలోనే డ్రాప్ అయినా తర్వాత చిరంజీవి సినిమా రంగంలో ఉండగానే మరోపక్క టెలివిజన్ రంగంలో మీలో ఎవరు కోటీశ్వరుడు అనే షో చేయడం జరిగింది. ఆ షో సమయంలో  విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ షో లో పాల్గొనడం జరిగింది.

 

ఆ సందర్భంలో షో మధ్యలో ఒక ప్రశ్నకి ప్రకాష్ రాజ్ ….పూరి జగన్నాథ్ కి ఫోన్ చేయడం అదే సందర్భంలో పూరి జగన్నాథ్ మరియు చిరంజీవి ల సంభాషణలు జరగటం ఆ సందర్భంలో చిరంజీవి ఖచ్చితంగా నీతో సినిమా చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఇటువంటి తరుణంలో తాజాగా చిరంజీవి -పూరి జగన్నాథ్ తో సినిమా చేయడానికి రెడీ అయినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో మెగా అభిమానులు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ టైం లో పూరి జగన్నాథ్ చిరంజీవికి ఇచ్చిన మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నారని వచ్చిన వార్తలపై కామెంట్లు చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: