బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని గురించి తెలుగులో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తక్కువ సినిమాల్లో నటించినా.. ఆమెకు ఫుల్ ఫాలోయింగ్ ఉంది. హాట్ ఫిగర్‌తో, సెక్సీ లుక్స్‌తో ఈ భామ ఇచ్చే ఫోజులకు గుండె కొట్టుకునే వేగం రెండింతలు పెరుగుతుంది.  ప్రతిసారి బికినీ పిక్స్ తో సోషల్ మీడియాలో కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తుంది. ఆ మద్య  దిశా పాటని ఓ ఆంగ్లపత్రికకు ఐసీసిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ యాక్షన్ హీరోల్లో తనకు టైగర్ ష్రాఫ్ అంటే ఇష్టమని చెప్పింది. అంతేకాక తనకు వండర్ విమెన్ లాంటి సినిమాల్లో సినిమాల్లో నటించాలని ఉన్నట్లు చెప్పుకొచ్చింది. నాకు యాక్షన్ సినిమాలు అంటే చాలా ఇష్టం. హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ, నటుడు టామ్ క్రూజ్ అంటే అభిమానం అని దిశా అన్నారు.  

 

బాలీవుడ్ యాక్షన్ బాలీవుడ్ యాక్షన్ స్టార్స్ లో నాకు టైగర్ ష్రాఫ్ అంటే ఇష్టం. యాక్షన్ సిక్వెన్స్ ను టైగర్ చేసినట్లు మరెవరు చేయలేరని దిశా అన్నారు. వీరిద్దరూ కలసి ఘాజీ 2 సినిమాలో నటించారు. ఆ సమయంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు రూమర్లు కూడా వచ్చాయి. కానీ తమ మద్య ఏమీ లేదని క్లారిటీ ఇచ్చారు. దిశకు ఉన్న హాట్ ఫిగర్‌కి ఈ పాటికి లక్షల్లో ప్రపోజల్స్ వచ్చి ఉంటాయని అనుకుంటాం. కానీ అలాంటిదేమీ లేదట. ఇప్పటివరకు తనకు ఒక్క ప్రపోజల్ కూడా రాలేదని దిశ అంటున్నారు. ఈ విషయాన్ని ఆమె ఓ సందర్భంలో వెల్లడించారు.  

 

ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను టామ్ బాయ్‌లా ఉండేదాన్ని. మా నాన్న పోలీస్. దాంతో అబ్బాయిలకు నన్ను చూడాలంటేనే భయం వేసేది. ఆ తర్వాత సినిమా కెరీర్ కోసం ముంబయి వచ్చాక అసలు ప్రైవసీ లేకుండాపోయింది. నేను ఎక్కువ బయట పార్టీలకు.. పబ్బులకు వెళ్లను... అందుకే నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ. అలాంటప్పుడు ఇక నాకు ప్రేమలో పడే అవకాశం ఎక్కడుంటుంది. త్వరలో నాకు ఎవరో ఒకరు ప్రపోజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే జీవితంలో ప్రేమ లేకపోతే ఎలా? మనం బతికేదే దాని కోసం కదా. నేను ప్రేమలో పడితేనే నేనూ ఓ అమ్మాయినే అని తెలిసొస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: