టాలీవుడ్ లో పెళ్లిచూపులు సినిమా తర్వాత విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ఈ మూవీలో విజయ్ దేవరకొండ అగ్రెసీవ్ గా కనిపించి.. బోల్డ్ డైలాగ్స్ తో బాగా ఆకట్టున్నారు.  నేటి తరం యువకులు ఈ స్టైల్ కి బాగా ఫిదా అయ్యారు.  విజయ్ దేవరకొండ నటించిన గీతాగోవిందం మూవీమరో సెన్సేషనల్ హిట్ అయ్యింది.  తర్వాత టాక్పీవాలా ఇలావరుస విజయాలు అందుకుంటున్న విజయ్ దేవరకొండ తాజాగా  వరల్డ్ ఫేమస్ లవర్  మూవీతో ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.  రోజున ప్రత్యేకంగా తమ సినిమాలు రిలీజ్ లు పెట్టుకుంటూంటారు. అదే కోవలో తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం రిలీజ్ అవుతోంది. అంతేకాదు తమిళ స్టార్ కమిడియన్ నటించిన ‘సర్వర్‌ సుందరం’ సైతం తెలుగులో అదే రోజు రిలీజ్ అవుతోంది.

 

 కోలీవుడ్ లో స్టార్ హీరోలకు ఫ్రెండ్ గా నటిస్తున్న సంతానం ఆ మద్య కామెడీ హీరోగా యూటర్న్ తీసుకున్నారు.  గతంలో సర్వర్ సుందరం మూవీ నగేశ్ నటించారు.  ఆయన కూడా కమెడియన్ గా ఉంటూనే హీరోగా నటించారు. అప్పట్లో ఈ మూవీ తెలుగు, తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ‘సర్వర్‌ సుందరం’టైటిల్ తోనే  తెరకెక్కిన చిత్రంలో సంతానం హీరోగా నటించారు. ఆనంద్‌ బాల్కి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కోసం సంతానం హోటల్ సర్వర్ గా ట్రైనింగ్ సైతం తీసుకున్నారు. 2016లోనే ఈ సినిమా పూర్తైంది.

 

అయితే రకరకాల కారణాలతో నాలుగేళ్ల తర్వాత ఈ సినిమా రిలీజ్ కు సిద్దమైంది.  ఈ సినిమాలో హీరోయిన్ వైభవి సంతానంకు జోడిగా నటించింది. ప్రముఖ నటుడు రాధా రవి ఈ మూవీలో కీలక పాత్రలో నటించడం జరిగింది.కామెడీ ఎంటర్టైన్మెంట్ తో పాటు మాస్ ఆడియన్స్ కు కావాల్సిన యాక్షన్ సన్నివేశాలు ఈ మూవీలో ఉండడం విశేషం. బల్కి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను ఉదయ్ హర్ష వడ్డెల, డి.వెంకటేష్ నిర్మాతలు.  సంతానం అంటే తెలుగు లో కూడా బాగానే గుర్తుపడతారు.. మనోడి కామెడీ తెలుగు లో వెన్నెల కిషోర్ టైప్ లో చాలా నేచురల్ గా ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: