డబ్బు సంపాదించాలంటే సినిమా హీరో అయితే చాలనుకునే వారు ఈ కాలంలో చాల మంది ఉన్నారు. అందుకే చదువుకునే వయస్సు  నుండే ప్రతి దాంట్లో తనను తాను హీరోల్లా చూసుకుంటారు.. అన్నీటిలోను హీరోలతో పోల్చుకుంటారు.. ఇకపోతే ఒకప్పటి హీరోల పారితోషికం ఎంత తక్కువగా ఉండేదో, అందరికి తెలిసిందే. కాని ఇప్పటి పరిస్దితుల్లో గట్టిగా ఒక హిట్ ఇచ్చాడంటే డైరెక్టర్‌తో సహా, హీరో కూడా సెటిల్ అవుతాడు. ఇప్పుడు హీరోల రెమ్యూనరేషన్స్ అంతలా పెరిగిపోయాయి..

 

 

ఇక చిత్రసీమలో హీరోల రెమ్యూనరేషన్ విషయానికి వస్తే సినిమా బ్యానర్‌ను బట్టి పారితోషకం మారితే, అతనికున్న ఇమేజ్‌ను బట్టి కూడా డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా ఒక హీరో సినిమాకు ఎంతవరకు తీసుకుంటున్నాడనే విషయం దర్శక నిర్మాతలకు, కంపెనీ ఆడిటర్‌, ఇన్‌కమ్‌టాక్స్‌ అధికారులకు మాత్రమే తెలుస్తుంది. మిగతా వాళ్ళకు తెలవడం చాలా అరుదు.. ఇకపోతే తమిళ ఇండస్ట్రీలో రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, అజిత్‌, విజయ్‌ లాంటి సూపర్ స్టార్లు రెమ్యూనరేషన్‌ గా దాదాపుగా రూ.40 నుంచి రూ.50 కోట్లు తీసుకుంటూ ఉండొచ్చని కోలీవుడ్‌ వర్గాల సమాచారం.

 

 

అయితే తాజాగా కోలీవుడ్‌ స్టార్ హీరో విజయ్‌ మాత్రం ఓ సినిమాకి వందకోట్లు అడిగాడట. అంతే కాదు ఆ పారితోషికం మీద ఉన్న జీఎస్టీ కూడా నిర్మాతే భరించాలని కండిషన్‌ పెట్డాడట. వందకోట్లకు జీఎస్టీ 18 కోట్లు అవుతుంది. అంటే ఆయన పారితోషికం మొత్తం అక్షరాల 118 కోట్లు అన్నమాట. అసలు విజయ్‌కు ఇచ్చే పారితోషికంతో ఎంచక్కా రెండు చిన్న సినిమాలు తీసుకోవచ్చంటున్నారు ఈ విషయం తెలిసిన సినీ జనాలు.

 

 

కాకపోతే ఆ నిర్మాత బాలీవుడ్‌కి చెందిన వ్యక్తి కావడంతో విజయ్ అంత డిమాండ్‌ చేశాడట. బాలీవుడ్‌ వారికి ఇదంతా సర్వసాధారణమే అన్న విషయం తెలిసిందే.. ఒకవేళ నిజంగానే ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యి, విజయ్‌కి అంత రెమ్యూనరేషన్ ఇస్తే మాత్రం.. సౌత్‌లో విజయ్ రెమ్యూనరేషన్ పరంగా రికార్డ్ బద్దలు కొట్టినట్టే అని అభిమానులు సంబరపడుతున్నారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: