టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పింక్ సినిమా తెలుగు రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ మెగాస్టార్ లెజెండ్ అమితాబ్ బచ్చిన నటించిన పింక్ బాలీవుడ్ సినిమా ఇటీవల అక్కడి ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ ని అందుకుంది. ఇక దాని తరువాత మరొక రెండు సినిమాలు కూడా లైన్లో పెట్టిన పవన్, ఇకపై తన ఫ్యాన్స్ ను మరింత ఖుషి చేయనున్నారు. ఇకపోతే టాలీవుడ్ సినిమా పరిశ్రమకు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్, ఆ తరువాత మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగారు. అయితే నటుడిగా అనతికాలంలోనే మంచి పేరు, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన పవన్, మధ్యలో అక్కడక్కడా కొన్ని మంచి సినిమాలు మిస్ చేసుకున్నారు. 

 

అయితే వాటిలో పవన్ మిస్ చేసుకున్న రెండు సినిమాలు, ఆ తరువాత సాధించిన విషయాలను పరిశీలిస్తే, పవన్ కనుక ఆ సినిమాలు చేసి ఉంటె అప్పట్లోనే మెగాస్టార్ నెంబర్ వన్ స్థానం అతడికి దక్కి ఉండేదని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక ఆ సినిమాలు ఏవంటే ఒకటి రవితేజ నటించిన ఇడియట్ అయితే, మరొకటి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతడు. ముందుగా ఇడియట్ కథను పవన్ కు వినిపించిన రవితేజ, అది ఆయనకు నచ్చకపోవడంతో ఆపై మహేష్ బాబు కు కూడా వినిపించానని, అయితే ఆయన కూడా కథపై సుముఖత వ్యక్తం చేయకపోవడంతో అనంతరం ఆ సినిమా చివరికి రవితేజకు చేరడం, అనంతరం తెరకెక్కిన తరువాత ఊహించని రేంజ్ లో సూపర్ డూపర్ హిట్ కొట్టి రవితేజకు యూత్, మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ తీసుకురావడం జరిగింది. 

 

ఇక మరొక సినిమా అయిన అతడు కథను మొదట త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కు వినిపించారట. అయితే ఆ కథ చెప్తున్న సమయంలో నిద్రపోయిన పవన్, దానిపై పెద్దగా ఆసక్తి చూపలేదని, అయితే చివరకు సూపర్ స్టార్ మహేష్ ఆ సినిమాని చేయడం, రిలీజ్ అనంతరం ఆ సినిమా అత్యద్భుత విజయాన్ని అందుకోవడం జరిగింది. అది మాత్రమే కాక ఇప్పటికీ టెలివిజన్ చరిత్రలో ఎన్ని సార్లు ప్రదర్శించినా కూడా అత్యధిక రేటింగ్స్ దక్కించుకునే ఆ సినిమా, త్రివిక్రమ్ క్లాసిక్స్ లో ఎప్పటికీ నెంబర్ వన్ సినిమాగా నిలుస్తుంది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. సో, ఈ విధంగా ఆ రెండు సూపర్ హిట్ సినిమాలు మిస్ చేసుకున్న పవన్, ఒకవేళ అప్పట్లో అవి కనుక చేసి ఉంటె, అప్పుడే మరింత గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించి నెంబర్ వన్ హీరో అయ్యేవారని అంటున్నారు. ఇక ఇప్పటికీ మహేష్, పవన్ ల మధ్య నెంబర్ వన్ స్థానం దోబూచులాడుతున్న విషయం తెలిసిందే.....!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: