ఈ మధ్యకాలంలో టాలీవుడ్‌లో విపరీతమైన పోటీ వాతావరణం కనిపిస్తుంది. అది హీరోల మధ్య, లేక నిర్మాతల మధ్య అనే విషయాన్ని పక్కనపెడితే, ఒకరకంగా చిన్న చిన్న సినిమాలకు ప్రోహత్సాహం కరువవుతుందనుకుంటే, పెద్దహీరోల సినిమాలకు కూడా ధియోటర్స్ దొరకని పరిస్దితి. ఎక్కువగా తెలుగు సినీ పరిశ్రమలో ఆధిపత్యపోరు నడుస్తుందనే మాట చాలా కాలంగా ప్రచారంలో ఉంది. ఇకపోతే తాజాగా విజయ్‌ దేవరకొండ సినిమా కూడా ఇలాంటి పరిస్దితినే ఎదుర్కొంటుందట.

 

 

ఇక విజయ్‌ దేవరకొండ కు ఫ్యాన్స్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు. పెళ్లి చూపులుతో దగ్గరైన ఈ హీరో నిత్యం అభిమానుల చూపులను తనవైపే ఉండేలా చేసుకుంటున్నాడు. ఇక అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో ఒక్కసారిగా విజయ్‌ దేవరకొండ స్టార్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌ అయ్యాడు.

 

 

కాని డియర్‌ కామ్రేడ్‌తో పాటు  కొన్ని చిత్రాలు నిరాశ పరచినా, విజయ్‌ దేవరకొండ క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. ఇకపోతే తాజాగా విజయ్ క్రాంతి మాధవ్‌ దర్శకత్వం లో వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ అనే చిత్రంలో నటించాడు. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందే భారీగా బజ్‌ క్రియేట్‌ చేసుకుంది. ఇలాంటి సమయంలో సినిమాకు థియేటర్ల సమస్య అంటూ నిర్మాత కేఎస్‌ రామారావు మీడియా ముందుకు వచ్చి అసహనం వ్యక్తం చేయడం ఆశ్చర్యంగా ఉంది.

 

 

విజయ్‌ దేవరకొండ సినిమా అంటే బయ్యర్లు హాట్‌ కేక్‌ మాదిరిగా అందుకునేందుకు సిద్దంగా ఉంటారు. కాని ఈ చిత్రం విషయంలో మాత్రం చాలా విభిన్నంగా పరిస్థితి ఉందట. ఒకరకంగా ఈ సినిమాకు థియేటర్లు చాలా తక్కువ లభిస్తుండటంతో, బయ్యర్లు ఆసక్తి చూపించక పోవడంతో నిర్మాత ఇబ్బందులు పడుతున్నాడట. కాగా ఈనెల 7వ తారీకునే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న జాను చిత్రం కోసం దిల్‌ రాజు చాలా ఎక్కువ థియేటర్లను బుక్‌ చేసి పెట్టాడు.

 

 

ఇప్పుడు ఆ థియేటర్లను వదలే పరిస్థితి కనబడటం లేదు. అయితే జాను రిలీజ్ తర్వాత వారంలో సగంకు పైగా థియేటర్లను వదిలేయ వచ్చు. కాని దిల్‌ రాజు మాత్రం అలాగే అంటిపెట్టుకుని ఉంటాడని ఆరోపణలు వస్తున్నాయి.. ఇలాంటి పరిస్దితుల్లో ఈ వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ ఫేమస్ వసూళ్లూ సాధించడం కష్టం అని అభిమానులు ఆందోళన పడుతున్నారట..

 

మరింత సమాచారం తెలుసుకోండి: