ధియేట‌ర్స్‌కి వ‌చ్చి సినిమాలు చూసే కాలం పోయింది. ఆన్‌లైన్ మొబైల్ అమెజాన్‌లు  అంటూ డిజిట‌ల్ వెనుక ప‌రిగెడుతున్నారు అంద‌రూ. క్రికెట్‌తో స‌హా అంద‌రూ మొబైల్‌లోనే చూసేస్తున్నారు. దీంతో ప్ర‌స్తుతం డిజిట‌ల్ ప్లాట్ ఫామ్ వైపే భవిష్య‌త్ అంతా న‌డుస్తుంది.  ఇప్పటికే దేశంలో అమేజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వాటిల్లో కోట్లు పెట్టిన సినిమాలు  మంచి క్వాలిటీతోనే విడుద‌ల‌వుతున్నాయి.  రోజు రోజుకి వీటిని చూసేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వ‌స్తోంది.

 

దీంతో భవిష్యత్ అంతా డిజిటల్ మీడియా పైనే న‌డుస్తుంది. దీన్ని గ్ర‌హించిన‌ నిర్మాతలు అల్లు అరవింద్ తాజాగా ‘ఓటీటీ’ అనే డిజిటల్ ఫ్టాట్ ఫామ్స్ లాంచ్ చేయడానికి రెడీ అయ్యారు. తమ మెగా హీరోల సినిమాల‌ను ఎక్కువ‌గా ఇందులోనే విడుద‌ల చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.  ఇక మిగతా హీరోల సినిమాలు కూడా కొనేసి విడుదల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.ఓటీటీ ప్రతీ సినిమాకు కొంత మొత్తం వసూలు చేస్తుంది. సంవత్సరం సబ్ స్క్ప్రిషన్ ఉంటుంది. 

 

దీంతో లాభాల పంట పండించవచ్చు ఇక టాలీవుడ్ మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ తర్వాత తెలుగులో విజయవంతమైన ప్రొడ్యూసర్ దిల్ రాజ్ అనే చెప్పాలి. ఇప్పుడు వారిద్ద‌రి  సైతం  డిజిటల్ ఫ్టాట్ ఫామ్ లోకి అడుగు పెడుతున్నారు. టాలీవుడ్ లోనే చాలా తెలివైన బిజినెస్ స్ట్రాటజీలు ఉన్న వీరిద్ద‌రూ ఈ విష‌యాన్ని  అమలు చేస్తూ విజయాలను అందుకుంటున్న దిల్ రాజు సైతం అల్లు అరవింద్ బాటలో కొత్త డిజిటల్ ఫ్టాట్ ఫామ్ ను ప్రారంభించేందుకు రెడీ అయ్యారట.. ఇక‌ ఇప్పుడు భవిష్యత్తును అంచనా వేసి టాలీవుడ్ అగ్ర నిర్మాతలు కొత్త పుంతలు తొక్కుతుండడం విశేషంగా మారింది. ఎప్ప‌టిక‌ప్పుడు టెక్నాల‌జీ డెవ‌ల‌ప్ అయిన‌ట్టు వీళ్ళు కూడా బిజినెస్ విష‌యంలో ఫుల్‌గా ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ అవుతున్నారు. ఇక‌పోతే ప్ర‌స్తుతం దిల్‌రాజు పింక్ రీమేక్ షూటింగ్‌తో బిజీగా ఉంటే... అల్లుఅర‌వింద్ ఇటీవ‌లె వాళ్ళ బ్యాన‌ర్‌లో వ‌చ్చిన అల‌వైకుంఠ‌పురంలో చిత్రం విజ‌యం సాధించిన సంబ‌రాల్లో ఉన్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: