సంగీతమ అంటే సాక్షాత్తు సరస్వతి దేవికి నిలయం అనే విశ్వాసం ప్రతి పండితుని మదిలో అజరామరంగా వెలుగుతూ ఉంటుంది.. ఒక రకంగా సంగీతం శిశువుల్ని, ప‌శువుల్ని, పాముల్ని కూడా సంతోషంలో ఓల‌లాడిస్తుంద‌ని అర్థం.

 

 

ఇదే కాకుండా క‌ర‌డు గట్టిన నేర‌స్తుల‌ను కూడా సాధు వ‌ర్త‌నులుగా మార్చ‌డం సంగీతానికే సాధ్యం. ఇదే కాకుండా ఒక మనిషిని కదిలించాలన్న, ఉర్రూతలూగించాలన్న అది ఒక్క సంగీతానికే సాధ్యం, కొన్ని దవాఖానలల్లో సంగీతంతో రోగాలను నయం చేస్తున్నారంటే సంగీతానికున్న గొప్పతనం ఏపాటితో అర్ధం అవుతుంది..

 

 

ఇది నిజ‌మే అని ఒప్పుకోకతప్పదు. ఎందుకంటే పూర్వకాలంలో మహాఋషులు సైతం తమ తపస్సులను ఈ సంగీత స్వరజతులకు దాసోహమై వదిలేసారు.. ఇకపోతే ఇప్పటి సినిమాలను తీసుకుంటే, అంతా కలుషితమే..

 

 

పాశ్చాత్య ధోరణిని అలంకరణ గా మార్చుకుని వికృతమైన సంగీత హోరులో పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు సంగీత ప్రియులు.  ఇలాంటి ఆధునికపోకడలు రాజ్యమేలుతున్న ఈ కాలంలో ఒక ఆణిముత్యం లాంటి సినిమాని ఎన్ని యుగాలవరకైనా గుర్తుంచుకోవచ్చూ. అదే 'శంక‌రాభ‌ర‌ణం'..

 

 

శిశుర్వేక్తి, పశుర్వేక్తి, వేక్తి గానరసం ఫణి: అంటూ సంగీతానికి శిశువులు, ప‌శువులూ ఓల‌లాడాల్సిందే న‌ని చెపుతూ, ఒకగానొక దశలో ఈ భార‌తీయ శాస్త్రీయ సంగీతం మ‌రుగ‌వుతున్న త‌రుణంలో 1980లో ఫిబ్రవరి 2వ తేదీన విడుద‌లైన శంక‌రాభ‌ర‌ణం సంచ‌ల‌న‌మైంది. సంగీతం పట్ల అమితమైన భావా బీజాలు సంగీతప్రియుల గుండెల్లో నాటింది.

 

 

ఆ సమయంలో అగ్ర‌క‌థానాయ‌కులుగా వెలుగొందుతున్న వారి చిత్రాల‌ను సైతం దిగ‌దుడుపు చేస్తూ, సినీ చ‌రిత్ర‌ని తిర‌గ‌రాసేలా ఈ త‌ర‌హా సినిమాలెన్నింటికో ఆద్యంగా నిల‌చింది.  ఎంతలా అంటే ఈ సినిమా విడుద‌ల‌య్యాక అనేక మంది శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకునేందుకు, కూచిపూడి, భ‌ర‌త‌నాట్యాల‌పై మ‌క్కువ పెంచుకున్నారంటే ఆశ్చ‌ర్య‌ పోన‌క్క‌ర్లేదు.

 

 

మనుషులు మారినా, కాలం మారినా సంగీతం మాత్రం నిత్య వసంతంలా, పవిత్రమైన గంగానదిలా ప్రవహిస్తూనే వుంటుంది..అందుకే సంగీతం దైవస్వరూపం అని అంటారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: