నేటికాలంలో వచ్చే సినిమాల్లో సాహిత్యాన్ని వెతుక్కోవలసి వస్తుంది. సంగీత హోరు ట్రాఫిక్‌లా మారి, అసలు సిసలైన సంగీతం ఎక్కడుంది ఇందులో అని చెవులు నిక్కబెట్టి వినే స్దితికి సంగీతం చేరుకుంది.. ఒకగానొక దశలో దిగజారిపోతున్న భారతీయ విలువలను సంగీతం అనే నాదం నిలబెడుతుంది. సంగీతానికి సైతం ఎందరో రాజులు దాసోహమైన చరిత్ర ఉంది. సంగీతాన్నే శ్వాసగా బ్రతికే మహోన్నత విద్వాంసులు నడయాడిన ఈ నేలలో ఇప్పుడు సంగీతం అంటే రెండు తాళాలూ, మూడు జతులు, నాలుగు శృతులు అనే విధంగా  తయారు అయ్యింది..

 

 

ఇకపోతే వేదకాలంలో భారతీయ సంగీతం శాస్త్ర మనోహరంగా విరాజమానమైంది. మన భారతదేశం సంగీతంలో, స్వర శృతి లయల సమాహారంగా భాసిల్లింది.. ఆ పరమేశ్వరుని పవిత్ర ఢమరుకంలోంచి నాదం పుట్టి ప్రకృతిలో చేరింది, అదే సంగీతం. చరిత్ర పయనంలో మార్గ, దేశి సంగీతాలు శాస్త్రీయ, వ్యవహారిక సంగీతాలుగా ప్రభవించాయి. పవిత్ర భారతీయ సంగీతానికి భూమిక భక్తి, వినోదం, చైతన్య ప్రభు, నామదేవ్, జ్ఞానదేవ్, తుకారాం, మీరాబాయి, భక్త జయదేవ్ లు భక్తి రస సంగీతంతో భారత దేశాన్ని ఉర్రూతలూపారు.

 

 

ఇంతటి గొప్ప చరిత్ర భారతీయ సంగీతానికే సాధ్యం. ఇక మన భారతీయ సంగీతం యొక్క గొప్పతనాన్ని గమనిస్తే, ప్రపంచంలో ప్రాచుర్యంలో వున్న పాశ్చాత్య సంగీతం లో కూడా స్వరాలు 12 మాత్రమే. కొంచెం విపులంగా పరిశీలిస్తే 16 గా గోచరిస్తాయి . కాబట్టి మన72 మేళ కర్త రాగాల పరిధి దాటిన స్వరాలు, స్వర సంగమాలు ప్రపంచ సంగీతంలో మరెక్కడా గోచరించవు.

 

 

అందుకే అంటారు ఇంతగొప్ప సంగీతానికి సైతం దేవతలు బానిసలుగా మారారని.. ఇకపోతే యువత పాశ్యాత్య సంగీతంలో పడి కొట్టుకుపోతోన్న సమయంలో సంగీతానికి అమృతాన్ని అందించిన సినిమా 'శంక‌రాభ‌ర‌ణం' ఈ చరిత్ర మరవని, మరచిపోని ఒక ఆణిముత్యం. ఎందుకంటే యువ‌త‌ కళ్లు తెరిపించిన 'శంక‌రాభ‌ర‌ణం' ఎప్పటికి భారతీయుల గుండెల్లో సజీవం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: