శంకరభరణం తెలుగు సినిమా గురించి ప్రస్థావిస్తే చెప్పుకునే సినిమాల్లో ఇది ఒకటి. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన అద్భుతమైఅ దృశ్య కావ్యం. అప్పటివరకు సినిమా అంటే ఒకే ఫార్మెట్ లో వెళ్తున్న రోజుల్లో సంగీత ప్రధానంగా తెరకెక్కిన సినిమా శంకరాభరణం. శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువైన రోజుల్లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా చూసిన తర్వాత ఎంతోమంది శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం మొదలు పెట్టారంటే ఈ సినిమా వారిపై ఎంత ప్రభావం చూపించిందో అర్ధం చేసుకోవచ్చు.
అంతేకాదు ప్రతి తెలుగు వాడు ఇది మా సినిమా అని గర్వంగా చెప్పుకునే సినిమాగా శంకరాభరణం సినిమా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. మనసుని కదిలించే సంగీతం మానసిక రోగానికి మందే సంగీతం.. అందుకే సంగీతం ఎలాంటి అద్భుతాలైనా సృష్టిస్తుంది. సినిమా వసూళ్లు.. రికార్డులు.. రివార్డులు అందుకోవడం కాదు కోట్లాది మంది ప్రేక్షక హృదయాల్లో చిరస్థాయిలో నిలిచిపోవడం ఈ సినిమా గొప్పతనం అని చెప్పొచ్చు.
అప్పటికే ఒక సీత కథ సినిమాతో ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్న కె.విశ్వానాథ్ జీవన జ్యోతితో సూపర్ హిట్ అందుకున్నాడు. సిరిసిరి మువ్వ సినిమాతో సూపర్ హిట్ కొట్టి సీతామాలక్ష్మి సినిమాతో కూడా సెన్సేషనల్ హిట్ అందుకున్న విశ్వనాథ్ శంకరాభరణంతో కెరియర్ బెస్ట్ హిట్ అందుకున్నారు. అప్పటి నుండి ఇక తిరుగులేని సినిమాలు చేశాడు విశ్వనాథ్. తెలుగు సిని పరిశ్రమకు ఆణిముత్యాల్లాంటి సినిమాలు అందించిన విశ్వనాథ్ శంకరాభరణం అప్పటికి ఇప్పటికి ప్రత్యేక స్థానంలో ఉంటుంది. శనరాభరణం సినిమా తర్వాత సంగీత్ ప్రధాన సినిమాలకు ఎక్కువ డిమాండ్ పెరిగింది. సంగీతంతో సినిమాను నడిపించొచ్చు అని నిరూపించిన సినిమా ఇది. విశ్వనాథ్, మహదేవన్ ల మ్యాజిక్ సినిమా సంగీతం ప్రేక్షకుల హృదయాలను సంగీతం ప్రపంచంలో మునిగితేలేలా చేసింది. 40 ఏళ్ళు అవుతున్నా శంకరాభరణం సినిమా పాటలు ఇప్పటికి వింటూనే ఉంటారు.