శంకరాభరణం తెలుగు లో పెద్ద హిట్ సినిమా అది.  నను దయ చూచెదవో అని వాణి జయరాం ఓ అద్భుతమైన పాటని ఆలాపించారు. అదే కాకుండా చక్కటి చిక్కని ఆవు పాలు లాంటి తెలుగు సాహిత్యాన్ని ఈ చిత్రం లో జోడించారు. అమ్మ కమ్మని సంతోషాల సంగితాన్ని ఇచ్చారు. అడుగులు వేయించిన నాన్న ప్రేమ లాంటి కల్మషం లేని మంచి పదాలని ఈ సాహిత్యం లో చూపించారు.
 
దొరకునా ఇటువంటి సేవ అంటూ వేటూరి ఇందులో ఎంతో గొప్పగా చూపించారు. సామజ వరగమన పాట కి కూడా ఓ ప్రత్యేకత ఉంది. ఇలా అనేక పాటల రూపం తో ఎంతో చక్కటి సాహితాన్ని వీరు ఈ చిత్రం ద్వారా మనకి సినిమా రూపం లో అందిచడం నిజం గా ఓ పెద్ద బహుమానం.
 
పాశ్చాత సంగితాన్నీ ఆ పదజాలాన్నీ శంకరాభరణం అనే ఓ గొప్ప ఆయుధం తో మన ముందుకి తోసుకొచ్చిన ఆ ప్రయత్నం ఓ పెద్ద విజయం. అలానే శంకర శాస్త్రి సభ కి పరిచయం అని పరిచయం చేసుకునే మాట నేడు అన్ని సభ ల్లో వాడే వక్తలని చూస్తే ఆ వాక్యం ఎంత హిట్ అయ్యిందో తెలుస్తుంది
 
నటీ నటులు విషయాన్ని ఎంపిక చేసిన దానికి వస్తే విజ్ఞానం, గాంభీర్యం, చిరు కోపం కలిగిన ఈ పాత్ర కి అక్కినేని నాగేశ్వర రావు ని , శివాజీ గణేశన్ అని అనుకున్నారు. కానీ వారిని ఏ విధంగా కూడా సంప్రదించడం జరగలేదు. అయితే కొత్త పాత్రల లో ప్రేక్షకులు తనని చూడరు ఏమో అని కృష్ణం రాజు తిరస్కరించారు. ఒక వేళ కృష్ణం రాజు కనుక ఈ పాత్రకి అంగీకరించి ఉంటే తన కెరీర్ లో ఊహించని మలుపు వచ్చేది. మరి అంత గొప్ప హిట్ సినిమా ఈ శంకరాభరణం
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: