బాహుబలి సినిమా ద్వారా భారతీయ సినిమాని శిఖరాగ్రాన నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. బాహుబలి సాధ్యమయ్యిందంటే దానికి ముఖ్య కారకులు ఇద్దరే అని చెప్పాలి. ఒకటి రాజమౌళి, రెండు ప్రభాస్. ఒక సినిమాకి ఐదేళ్ల వరకు డేట్లు ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. ఐదేళ్ల కాలంలో కేవలం రెండే చిత్రాలు చేసాడంటే అతని కమిట్ మెంట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

 

 

 


 ఆ కమిట్ మెంట్ కి ప్రభాస్ తగిన ప్రతిఫలమే లభించింది. బాహుబలితో ప్రభాస్ నేషనల్ స్టార్ అయిపోయాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ సాహో సినిమా చేశాడు. ఇప్పుడు రాధాక్రిష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమాతో బిజీగా ఉంటే, ప్రభాస్ తన సినిమాతో బిజీగా గడుపుతున్నాడు. అయితే వీరిద్దరికీ క్లాష్ ఏర్పడనుంది.

 

 


ఇద్దరి సినిమాల షూటింగ్ లు ఒకేసారి ముగిసేలా ఉన్నాయి. సినిమాలు ముగియడమే కాదు రెండు సినిమాల రిలీజ్ డేట్లు కూడా క్లాష్ అయ్యే పరిస్థితి ఉండనుంది. ఆర్.ఆర్.ఆర్ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాదని తేలిపోవడంతో దసరాకి గానీ, లేదంటే వచ్చే ఏడాది సంక్రాంతికి గానీ విడుదల చేయాలని భావిస్తున్నారట. అయితే ఇంతవరకు ఏ విషయం కన్ఫర్మ్ కాలేదు.

 

 

రాజమౌళి తన సినిమా విడుదల తేదీని ప్రకటిస్తే ప్రభాస్ తన సినిమా కొసం సరైన తేదీని ఎంచుకుంటాడట. ఒకవేళ రాజమౌళి దసరాకి వస్తే ప్రభాస్ సంక్రాంతికి మారిపోతాడట. లేదు రాజమౌళి సంక్రాంతికి ఫిక్స్ అయితే ప్రభాస్ దసరాకి వచ్చే ప్రయత్నం చేస్తాడట . ఏది ఏమైనా రాజమౌళి క్లారిటీ కోసం ప్రభాస్ వెయిట్ చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: