మన స్టైలిష్ స్టార్ ఆల్లు అర్జున్ అనే పేరు వినగానే ముందు మనకి గుర్తు వచ్చేది డాన్స్. అది ఇంతకు ముందు కానీ ఇప్పుడు మాత్రం బన్నీ అంటే సామజవరగమన...అయితే బన్నీ కి ఈ అల వైకుంట పురం సినిమా తో ఓ మంచి హిట్ లభించడం నిజం గా ఆనంద దాయకం. అయితే ఈ సినిమా ని నిజం గానే ఎంతో శ్రమ తో మంచి కధ తో స్టార్ డైరక్టర్ త్రివిక్రం శ్రీనివాస్ గారి రూప కల్పన ఇది అని మనకి కనపడుతున్న సంగతే. అయితే సినిమా హీరో అల్లు అర్జున్ అలానే హీరోయిన్ పూజ హెగ్దే ఓ మంచి నటన తో వారి యాక్టింగ్ స్కిల్స్ తో చాలా బాగా ప్రేక్షకులని ఆకట్టుకున్నారు.
 
అలానే ఓ చక్కటి ఎటెంప్ట్ ఇచ్చారు మురళీ కృష్ణ గారు. సీనియర్ హీరోయిన్ టబు కూడా మంచి పాత్ర ని తన దైన శైలి లో నటించి పాత్ర కి ప్రాణం పోసారు. మ్యూసిక్ డైరెక్టర్ తమన్ చక్కటి ఆల్బం ని ఇస్తే దానికి సిద్ద్ శ్రీరాం వంటి గాయకులు దానికి వారు ప్రతిభని చూపించి పేరు ని చాటుకున్నారు. ఇలా సినిమా అంతా విజయానికి కారణం. సిరి వెన్నెల సీతా రామ శాస్త్రి, రామ జోగయ్య శాస్త్రి గారు లాంటి సీనియర్ రచయతలు కూడా ఒక చక్కని పాటల జల్లుని కురిపించారు
 
ఇలా ఈ సినిమా హిట్ అయ్యింది. అయితే బన్నీ కుటుంబం తో కలిసి ఈ సినిమా సక్సెస్ అందుకున్న సందర్భం గా ఓ పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. దీనికి గాను సినిమా వాళ్ళ అందరికీ ఇన్విటేషన్  ని సెండ్ చేసారు. ఇప్పటికే చాలా వరకు ఆ పని పూర్తి అయ్యిపోయింది. పాటల జల్లు ప్రేక్షకులని ఆకట్టుకున్నది
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: