డాన్స్ అంటే చాలా మందికి ఇష్టం. మంచి ఊపున్న సాంగ్స్ వింటే వెంటనే మనస్సు డాన్స్‌ చేయాలని ఆరాటపడుతుంది. అదే సినిమాలో అయితే, హీరోలు వేసే స్టేప్పులకు అంతే ఫీదా అవ్వని వారుండరూ. అయితే, గతంలో వచ్చే సినిమాల్లో కొరియోగ్రఫర్లు కేవలం హీరోలకు అదిరిపోయే స్టెప్పులు పెట్టి హీరోయిన్‌లకు సదాసీదా స్టెప్పులతో కానిచ్చేవారు. కానీ ప్రస్తుతం మరిపోయింది. తెలుగు ఇండ్రస్టీలోకి వస్తోన్న హీరోయిన్లు నటనతోనే కాదు వారి స్టెప్పులతో కుర్ర కారు మనస్సును ఊపేస్తోన్నారు.

 

ప్రస్తుతం సినిమా రంగంలో రాణిస్తున్న అందం, అభినయంతో పాటు డాన్స్‌ స్టేప్పులతో ఆకట్టుకుంటున్నారు. హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా వారి టాలెంట్ ను ప్రదర్శిస్తున్నారు. కానీ ఇటీవల వస్తున్న హీరోయిన్లు హీరోలు సైతం ఆశ్చర్యపోయేలా డాన్స్ అదరగొట్టేస్తున్నారు. ఇటీవల కాలంలో మాస్ స్టెప్పులతో అలరించిన హీరోయిన్లు వీళ్ళే....

 

సరిలేరు నీకెవ్వరూ సినిమాతో టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. రష్మిక ప్రస్తుతం తిరుగులేని హీరోయిన్ గా మారిపోయింది. ఇటీవల మహేష్ బాబుతో నటించిన చిత్రంలో మైండ్ బ్లాక్ సాంగ్ లో మహేష్ తో కలసి మాస్ స్టెప్పులు అదరగొట్టింది. తన డాన్స్ లతో తనదైన ముద్ర వేసుకుంది.

 

మజ్ను మూవీతో ఎంట్రీ అయినా నిధి అగర్వాల్ కూడా మంచి డాన్సర్. ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో దిమాఖ్ ఖరాబ్ సాంగ్ లో అందాలు ఆరబోస్తూ రామ్ కి పోటీగా నిధి డాన్స్ చేసింది. తన అమాయకపు మొహంతో అభిమానులను ఆకట్టుకుంది. ఇదే సినిమాలో రామ్ పక్కన నటించిన నభా నటేష్ కూడా డాన్సులో తనదైన ముద్ర వేసుకుంది.  ఇస్మార్ట్ శంకర్ చిత్రంలోనే దిమాఖ్ ఖరాబ్ సాంగ్ కు నభా నటేష్ కూడా డాన్స్ చేసి మెప్పించింది.

 

ఫిదా చిత్రంలో టాలీవుడ్ లోకి ఎంట్రీ అయినా సాయి పల్లవి అద్భుతమైన డాన్సర్. గ్లామర్ షో చేసేందుకు ఇష్టపడదు కానీ డాన్స్ మాత్రం అదరగొట్టేస్తుంది. ఫిదా చిత్రంలో 'వచ్చిండే' సాంగ్ కు, మారి 2 చిత్రంలో 'రౌడీ బేబీ సాంగ్ కు సాయి పల్లవి డాన్స్ చూస్తే మతి పోవాల్సిందే. ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా క్రేజీ హీరోయిన్. పూజా హెగ్డే రంగస్థలంచిత్రంలో జిగేలు రాణి పాటకు, డీజే మూవీలో సీటిమార్ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: