'ఎక్కడికి పోతావు చిన్నవాడా' తో హిట్ అందుకున్న దర్శకుడు వీఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్, నభా నటేష్, తాన్యా హోప్ నటించిన  సినిమా డిస్కోరాజా. ఈ సినిమా ఈ నెల 24 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా నుండి రిలీజైన టీజర్స్.. లిరికల్ సాంగ్స్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. గత కొంతకాలంగా రవితేజ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాపవుతూ వచ్చినప్పటికి ఆ ప్రభావం 'డిస్కోరాజా' సినిమాపై పడకపోవడం ఆసక్తికరం. దాంటో బిజినెస్ కూడా బాగా జరిగింది. శాటిలైట్ కూడా మంచి బిజినెస్ అయిందని చెప్పారు. దాంతో మాస్ రాజా ఒక రేంజ్ హిట్ కొడుతున్నాడని అందరు అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. 

 

మాస్ రాజా నుంచి ఫ్యాన్స్ గాని కామన్ ఆడియన్స్ గాని ఆశించిన అంశాలు లేకపోవడంతో సినిమా ఫ్లాప్ గా మిగిలింది. ఫస్టాఫ్ మొదలవగానే థియోటర్స్ లో జనాలకి మబ్బులు విడిపోవడం స్టార్ట్ అయ్యాయి. అసలు ఏమి జరుగుతుందో కూడా అర్థం కాక కథ ఏంటీ అని ఆలోచించే లోపే ఇంట్రవెల్ అని ప్రేక్షకులకు షాకిచారు. ఆ షాక్ లో నుండి తేరుకొని సెకండాఫ్ లో ఏముందో వెతుక్కునే పరిస్థితిలో ఉండగానే క్లైమాక్స్ తర్వాత శుభం కార్డ్ పడగానే జనాలకి ఫుల్ ఫ్రస్టేషన్ వచ్చి ఛీ ఛీ ఇదేం సినిమా రా నయనా అంటూ చీ కొడుతూ బయటకు వచ్చారు. అంతేకాదు బయట నెక్స్ట్ షోకి ఆత్రంగా వెళ్ళే వాళ్ళకి కూడా భయ్యా అంత ఆవేశపడకండి సినిమా బిస్కెట్ అక్కడ అంటూ సెటైర్స్ వేస్తూ వచ్చారట.

 

ఇక ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది థమన్ గురించే అంటూ వెటకారంగా థమన్ ని తిట్టుకున్నారు. ఇప్పటి వరకు రవితేజ-థమన్ కాంబినేషన్ లో వచ్చిన మిరపకాయ్, కిక్, బలుపు, పవర్ ..వంటి సినిమాలకి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమాలన్ని థమన్ బెస్ట్ మ్యూజిక్ అని పేరుని తెచ్చుకున్నాయి. ఇక రీసెంట్ గా అల వైకుంఠపురములో సినిమాకి థమన్ మ్యూజిక్కే పెద్ద మ్యాజిక్ అని అందరి నొటా వినిపించే లెవల్ ఇచ్చాడు. అంతేకాదు సినిమా బ్లాక్ బస్టర్ అవడానికి పెద్ద కారణం కూడా థమనే. ఇదే విషయాన్ని సక్సస్ ఈవెంట్ లో అల్లు అర్జున్, డైరెక్టర్ త్రివిక్రం గొప్పగా చెపారు. 'అల' సక్సస్ క్రెడిట్ ఎక్కువగా థమన్ కే ఇచ్చారు. దాంతో రవితేజ మ్యూజిక్ పరంగా తమన్ డిస్కోరాజ సినిమాకి మ్యాజిక్ చేస్తాడనుకుంటే ఛీ..ఛీ అనిపించుకేలా ఇచ్చాడు. అంతే అన్ని రకాలుగా పెద్ద బొక్క పడింది రవితేజ కే. ఈ సినిమాతో సక్సస్ కొడతా అని ఎంతో ఊపు మీదున్న రవితేజ వికెట్ ఢమాల్ అని పడింది. ఫస్ట్ బాల్ కే ఫస్ట్ వికెట్ పడినట్టుగా రవితేజ కి భారీ ఫ్లాప్ పడింది. దాంతో వరుసగా భారీ సినిమాలు ఫ్లాపవుతూ వికెట్ల మీద వికెట్లు పడుతుంటే ఇప్పుడు రవితేజ వికెట్ కూడా తోడైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: