టాలీవుడ్ మాస్ రాజా రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా డిస్కో రాజా ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చి ఓవరాల్ గా నెగటివ్ టాక్ ని మూటగట్టుకుంది. చాలా గ్యాప్ తరువాత రవితేజ డ్యూయల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో హీరోయిన్లుగా నభ నటేష్, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ నటించగా యువ దర్శకుడు విఐ ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఎస్సార్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మాతగా రూపొందిన ఈ సినిమాని దర్శకుడు ఆనంద్ తన గత సినిమాల మాదిరిగానే ఒక సైన్స్ ఫిక్షన్ కథాంశం తీసుకుని తెరకెక్కించడం జరిగింది. 

 

అయితే మంచి కథాంశాన్ని ఎంచుకున్న దర్శకుడు, సినిమా సెకండ్ హాఫ్ లో దానిని ప్రక్క దారి పట్టించి ఎక్కువగా సినిమాని రొటీన్ కమర్షియల్ దిశగా తీసుకువెళ్లడంతో మెజారిటీ ప్రేక్షకులు సినిమాపై పెదవి విరిచారు. ఇక ఇప్పటికే రవితేజ ఖాతాలో టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటోని ల సినిమాల రూపంలో వరుసగా మూడు భారీ డిజాస్టర్లు ఉండడంతో, ఈ సినిమా అయినా ఆయనను గట్టెక్కిస్తుంది అని ఆయన ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా భావించారు, కానీ ప్రస్తుతం ఈ సినిమా తొలివారం కలెక్షన్స్ చూస్తుంటే, వాటి మూడింటిని మించేలా వాటెమ్మ మొగుడు దెబ్బ మాదిరిగా మరింత నష్టాలు మిగిల్చే అవకాశం ఉందని అంటున్నారు. 

 

ఇక ట్రేడ్ విశ్లేషకులు నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ డిస్కో రాజా సినిమా తొలివారం వసూళ్లు రూ. 7.65 కోట్లు మాత్రమే అందుకుందని అంటున్నారు. నిజానికి ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి రూ.22 కోట్లు అయితే, సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం రూ.18 కోట్ల మేరకే జరిగినట్లు తెలుస్తోంది. సో, దీనిని బట్టి చూస్తుంటే రాబోయే మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా కథ పూర్తిగా ముగియనుందని, ఇక నిర్మాతకు ఒకవైపు రూ.4 కోట్లతో పాటు బయ్యర్లు మరింత భారీ రేంజ్ లో ఈ సినిమా అత్యధిక నష్టాలు కట్టబెట్టే అవకాశం ఎక్కువగా ఉందట. కాబట్టి మాస్ రాజా ఇకనైనా తన తదుపరి సినిమాల ఎంపిక విషయమై మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ప్రేక్షకులు అంటున్నారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: