మెగా కాంపౌండ్ నుండి నటిగా ఇటీవల టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ప్రవేశించిన మెగాబ్రదర్ నాగబాబు కుమార్తె అయిన నిహారిక కొణిదెల, తొలిసారిగా నాగశౌర్య సరసన ఒకమనసు అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత సుమంత్ అశ్విన్ తో కలిసి ఆమె నటించిన హ్యాపి వెడ్డింగ్ తో పాటు ఇటీవల ఆమె నటించిన మరొక సినిమా అయిన సూర్యకాంతం కూడా బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం సక్సెస్ కాలేదు. నిజానికి ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కానప్పటికీ, ఆ సినిమాల్లో నిహారిక తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరు దక్కించుకుంది అని చెప్పవచ్చు. 

 

ఇక ఇటీవల మెగాస్టార్ హీరోగా వచ్చిన సైరా నరసింహారెడ్డి లో ఒక గిరిజన యువతి పాత్రలో కొద్దిసేపు కనిపించిన నిహారిక, అంతకముందు ముద్దపప్పు ఆవకాయ, నాన్న కూచి వంటి వెబ్ సిరీస్ లో కూడా నటించడం జరిగింది. ఇక కొద్దిరోజుల క్రితం పింక్ ఎలిఫెంట్ పిక్చర్ అనే పేరుతో ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించి ఆ సంస్థ ద్వారా ప్రస్తుతం మ్యాడ్ హౌస్ అనే వెబ్ సిరీస్ ని ఆమె నిర్మిస్తూ, దానిని యూట్యూబ్ లో ప్రసారం చేస్తున్నారు. ఇక స్వతహాగా ఎంతో చలాకీగా ఉండే నిహారిక, నేడు జరిగిన ఒక పర్సనల్ ఫోటో షూట్ లో భాగంగా గ్రీన్, బ్లాక్ రంగులు కలగలిపిన లేటెస్ట్ ట్రెండీ స్టైల్ డ్రెస్ లో ఎంతో హాట్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది. అయితే ఆ హాట్ ఫోజులతో ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపుకు త్రిప్పుకుంది. 

 

ఇక ప్రస్తుతం ఆమె దిగిన ఆ ఫోటోలు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో హల్ చల్ చేస్తుండగా, కొందరేమో, అమ్మో నిహారిక నిన్ను ఇంత అందమైన డ్రెస్ లో చూసిన కుర్రాళ్ళ మనసులు ఆగగలవా ఇక అంటూ ఒకింత సరదాగా పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. ఇక కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి, అతి త్వరలో ఆమె మరొక సినిమాలో నటించనున్నట్లు చెప్తున్నారు. మరి ఈసారైనా సినిమా కెరీర్ పరంగా నిహారిక ఎంత వరకు సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి..!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: