సినిమాల్లో తిరుగు లేకుండా దూసుకెళ్లుతున్న పవన్ పయనం రాజకీయాల వైపు మళ్లీంది. సామాన్యంగా సినీ జీవితం నుండి రాజకీయాల వైపు దారి మళ్లీంచి, మళ్లీ సినిమా రంగం వైపు వచ్చిన వారు చాలా తక్కువగా కనిపిస్తారు. అంతేకాకుండా అవకాశాలు కూడా అంతగా కనిపించవు.. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఇది పూర్తి భిన్నంగా సాగుతుంది. మళ్లీ సినిమాలు చేస్తా అనగానే వరుసగా నాలుగు చిత్రాలు చేతిలో రావడం, పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్‌ను నిరూపిస్తున్నాయి.

 

 

పవన్ సినిమా చేస్తున్నాడని టాక్ బయటకు రావడంతో ఆయన అభిమానుల మనుసుల్లో కలిగే సంతోషం అంతా ఇంతా కాదు.. ఇకపోతే పవన్ నటించిన సినిమాల్లో గోపాల గోపాల గురించి కాస్త తప్పక చెప్పుకోవాలి. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వెంకటేష్ ఇలా ఇద్దరు పెద్ద స్టార్ కలిసి నటించిన ఈ చిత్రంలో పవన్ పాత్ర సమాజానికి మార్గోపదేశాన్ని చేసేలా ఉంది. ఇందులో మోడరన్ కృష్ణుడు గా నటించి, ఈ సినిమా కధానాయకుడికి గీతోపదేశం చేస్తూ అతని ఆలోచన విధానాలను సహాయం అనే నాగలితో చదును చేస్తాడు. భగవంతుడే లేడు అని వితండ వాదం చేసే వ్యక్తి దారిని, దేవుడు అందరిలో ఉన్నాడు, అన్నీంటిలో ఉన్నాడని తెలిసేలా చేస్తాడు.

 

 

ఇక కధ, కధనం అన్ని చాలా డిఫరెంట్‌గా సాగుతాయి. ఇప్పటి వరకు చూపించిన కృష్ణులు వేరు ఈ సినిమాలో చూసిన కృష్ణుడు వేరు. ఈ చిత్రంలో హీరో దేవుణ్ని ఎంతగా నిందించిన చిరునవ్వుతో సమాధానం చేబుతూ, తన సమస్యను తానే పరిష్కరించుకునేలా ముందుకు నడిపిస్తాడు ఈ మాడ్రన్ కృష్ణుడు. ఇకపోతే ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ ప్రెవేట్ లిమిటెడ్ బ్యానర్ల పై దగ్గుబాటి సురేష్ బాబు మరియు శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి కిషొర్ కుమార్ పార్ధసాని దర్శకత్వం వహించగా, వెంకటేష్ సరసన శ్రియ శరణ్, కధానాయక పాత్ర పోషించారు.

 

 

మిగతా పాత్రల్లో మిథున్ చక్రవర్తి, కృష్ణుడు, ఆశిష్ విద్యార్థి, మురళీ శర్మ, పోసాని కృష్ణ మురళి నటించారు.. కాగా 2012 లో విడుదల అయిన హిందీ చిత్రం ఓహ్ మై గాడ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కగా, ఈ చిత్రం 10 జనవరి 2015 న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.. ఇక అభిమానుల గుండెల్లో అంతులేని ప్రేమను సంపాధించుకున్న ఈ పవర్ స్టార్ మోడరన్ కృష్ణుడు ఇప్పటికి అభిమానులకు 'పవన్' డే...

మరింత సమాచారం తెలుసుకోండి: