మెగాస్టార్ తమ్మునిగా సినీ రంగప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ త్వరగానే తనకంటు ఒక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు స్టార్లుగా వెలుగొందుతున్న హీరోలకు, పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానాలకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ విభిన్న ఆలోచనా ధోరణే పవన్ కళ్యాణ్ కి చిత్రసీమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టిందనడంలో సందేహం లేదు.. అదీగాక హీరోగా చేస్తూనే దర్శకత్వ బాధ్యతలను చేపట్టాడు. ఒకరకంగా అతి పిన్న వయసులోనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన కథానాయకులలో పవన్ కళ్యాణ్ ఒకరని చెప్పవచ్చూ.

 

 

ఇక ఒక టెక్నీషీయ‌న్‌గా, హీరో గా, లిరిక్‌రైట‌ర్‌ గా, సింగర్‌, డైరెక్ట‌ర్‌... ఇలా అన్నీంటిలో ఆల్‌ర్ రౌండ‌ర్‌ అనిపించుకున్నాడు పవన్... తన చిత్రాలకి, చిరంజీవి నటించిన చాలా చిత్రాలకు పవన్ కళ్యాణ్ ఫైట్ లని కంపోజ్ చేశాడు.. ఖుషి లోని ద్వితీయార్థంలో జరిగే కార్నివాల్ ఫైట్ పవన్ కళ్యాణ్ ప్రతిభకు తార్కాణం. సాధారణంగా మార్షల్ ఆర్ట్స్ లో దిట్ట కావటంతో పవన్ నటించే చిత్రాలలో చాలా స్టంట్ లు నిజంగా చేసినవే ఉంటాయి. అటువంటి స్టంట్ లను పవన్ చిత్రాల్లో ప్రత్యేకంగా స్లో మోషన్ లో చూస్తారు దర్శకులు.. ఇక లిరిక్ రైటర్‌గా తమ్ముడు చిత్రంలో లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ పాటను పూర్తి నిడివి ఆంగ్ల గీతంగా రూపొందించాడు.

 

 

బద్రి చిత్రంలో మేరా దేశ్ హై ప్యారా ప్యారా తెలుగు, హిందీ, ఆంగ్లంల కలయికతో త్రిభాషా గీతంగా, ఖుషిలో యే మేరా జహాన్ గీతాన్ని పూర్తి నిడివి హిందీ గీతంగా రూపొందించాడు. ఖుషి చిత్రంలో ఆడువారి మాటలకు అర్ధాలు వేరులే, జానీ చిత్రంలో ఈ రేయి తీయనిది పాటలని రీ-మిక్స్ చేయించారు. అంతే కాకుండా సింగర్‌గా అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి చిత్రాలలో కూడా ఒక పాటని ఆలపించారు.

 

 

ఇక పవన్ నటించే సినిమాల్లో కనీసం ఒక్క జానపద గీతమైనా ఉంటుంది. ఇదే కాకుండా అప్పుడప్పుడు నేపథ్యగాయకులతో, కలసి గొంతుకూడా కలుపుతాడు..  ఇకపోతే ఒక  నటుడిగా, రాజకీయవేత్తగా, సామాజిక సేవకుడిగా ఆయనను గుర్తించిన ఇండో-యూరపియన్ బిజినెస్ ఫోరమ్ వారు నవంబరు 2017 లో గ్లోబల్ ఎక్సెలెన్స్ పురస్కారం  అవార్డు ఇచ్చారు... 

మరింత సమాచారం తెలుసుకోండి: