ప్రముఖ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ముఖ్యశిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా నటించిన ‘ఆర్ఎక్స్ 100’ మూవీతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ పాయల్ రాజ్ పూత్.  అప్పటికే జోద్ పూర్ మూవీస్ లో నటించిన ఈ చిన్నది ఈ మూవీలో అందాల ఆరబోతతో రెచ్చిపోయింది.  లిప్ లాక్ సీన్లలో హీరోకే తిమ్మతిరిగేలా నటించింది. ఈ మూవీపై మొదట్లో చాలా కామెంట్స్ వినిపించినా.. తరువాత పాిజటీవ్ టాక్ తెచ్చుకుంది.  కాకపోతే హీరోహీరోయిన్ల మద్య వచ్చే బూతు సీన్లు మాత్రం కొంత మంది రిసీవ్ చేసుకోలేకపోయారు. అయితే ఈ మూవీలో పాయల్ రాజ్ పూత్ విలన్ గా నటించింది. 

 

మొదటి సినిమాలో అలాంటి పాత్రలో నటించాలంటే నిజంగానే ఎంతో గట్స్ ఉండాలని అప్పట్లో ఈ అమ్మడిని తెగ మెచ్చుకున్నారు.  తర్వాత ఆర్ డీఎక్స్ మూవీలో అలాగే అందాలు ఆరబోసినా ప్రేక్షకులు తిప్పి కొట్టారు. దాంతో అందం తో పాటు నటనకు ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ చేసుకుందట. ఇటీవల వెంకటేష్ నటించిన ‘వెంకిమామ’ మంచి రెస్పాన్స్ గుర్తింపు తెచ్చుకుంది.  ఆమె ప్రముఖ దర్శకుడు జయంత్ సి.పరాన్జీ తాజా మూవీ ‘నరేంద్ర’లో ఇండియన్ ఫస్ట్ ఫిమేల్ ఫైటర్ పైలెట్‌గా ఒక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తోంది.

 

ఒక అమాయకుడైన భారతీయ బాక్సర్ పాకిస్థాన్ జైలులో ఎలా బందీ అయ్యాడు? అక్కడి నుండి ఎలా తప్పించుకుని బయట పడ్డాడు? అనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీ సమ్మర్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. హీరోగా పరిచయం అవుతున్న నీలేష్ బాక్సర్ పాత్రలో నటిస్తున్నారు. బ్రెజిలియన్ బ్యూటీ ఇసాబెల్లా మానవ హక్కుల కార్యకర్త పాత్ర పోషిస్తోంది. అలాగే ఆఫ్ఘన్ ఖైదీగా ఫేమస్ డబ్లుడబ్లుఈ స్టార్ ద గ్రేట్ ఖలి నటిస్తున్నారు. ఈ మూవీతో మరి అమ్మడుకి సక్సెస్ కలిసి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: