పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎంటర్ అయినప్పటి నుండి ఇప్పటి వరకూ కొత్త కొత్త ప్రయత్నాలు చేశాడు. ఇండస్ట్రీలో అప్పటి వరకూ పేరుకుపోయిన పాత పద్దతులని మార్చే ప్రయత్నం చేశాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్ తన అన్న మెగాస్టార్ సినిమాలకి ఫైట్స్ కూడా కంపోజ్ చేశాడు. అలాగే సినిమాల్లోని పాటల్లో డాన్సులతో ఊదరగొట్టేస్తుంటే, కేవలం చిన్న మూమెంట్స్ తో, పాటల్లోని అర్థాన్ని ప్రేక్షకులకి చేరువ చేసేలా చేయగలిగాడు.

 

 

తమ్ముడు, ఖుషి, బద్రి సినిమాల్లో పాటలని గమనిస్తే ఈ విషయం క్లియర్ గా అర్థం అవుతుంది. ఇలా వినూత్నంగా ఆలోచించే పవన్ కళ్యాణ్ కొత్త దర్శకులని ఎంకరేజ్ చేయడంలో చాలా ముందుంటాడు. టాలీవుడ్ లో డేరింగ్, డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరిజగన్నాథ్ అలా వచ్చినవాడే. పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ తో తీసిన బద్రి సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు.

 

 

అప్పట్లో కొత్త దర్శకులకి అవకాశం ఇచ్చే వారు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే. అందుకే పూరి జగన్నాథ్ బద్రి కథతో పవన్ వద్దకి వెళ్ళాడట. ముందుగా అరగంట టైమ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్, అలా కొనసాగుతూ నాలుగు గంటలపాటు కథ విన్నాడట. అంతా విన్నాక కథ బాగానే ఉంది గానీ క్లైమాక్స్ లో కొంచెం మార్చాలి అని చెప్పాడట. ఒక వారం రోజులు సమయం తీసుకుని మార్చమని చెప్పాడట.

 

 

దానికి ఒకే అన్న పూరి వారం తర్వాత మళ్లీ వచ్చి అదే క్లైమాక్స్ ని చెప్పాడట. ఇది ఇంతకుముందు చెప్పిందే కదా.. మార్చలేవేంటని పూరిని అడిగితే.. ఈ కథకి ఈ క్లైమాక్స్ అయితేనే బాగుంటుందని మార్చలేదని చెప్పాడట. అప్పుడు పవన్ కళ్యాణ్ అసలు నిజం బయట పెట్టాడట. నాకోసమ్ కథని మారుస్తావో లేదోనని టెస్ట్ చేసానని, కథ నాకు బాగా నచ్చిందని చెప్పాడట. మొత్తానికి ఆ విధంగా బద్రి సినిమా తెరకెక్కిందన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: