ఈ మద్య కొంత మంది దర్శకులు తమ టాలెంట్ తో ఒకటీ రెండు సినిమాలతోనే స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటున్నారు. ఇప్పడుు వస్తున్న కుర్ర డైరెక్టర్లు సినియర్ డైరెక్టర్లకు పోటీగా నిలుస్తున్నారు.  ఇటీవల అనీర్ రావిపూడి, సందీప్ వంగ, గౌతమ్ తిన్ననూరి మరికొంత మంది దర్శకుడు మంచి కాన్సెప్ట్స్ తో సూపర్ హిట్స్ అందుకుంటున్నారు.  నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘జెర్సీ’. ప్రస్తుతం యువ దర్శకులు చాలా స్ట్రాటజీగా తమ కెరీర్ ని ప్లాన్ చేసుకుంటున్నారు. గతంలో కొంత మంది ఒక స్టార్ హీరోని పట్టుకుని ఏళ్ల తరబడి వాళ్ల వెంటపడి వాళ్లు ఇచ్చిన టైమ్ ప్రకారం సినిమాలు తీస్తూ ఫ్లాపులు చవిచూసిన విషయం తెలిసిందే.

 

నలుగురైదురు హీరోలకు ఒకే సారి కథ చెప్పి...ఎవరు ముందు ఓకే అంటే వాళ్లతో ముందుకు వెళ్లిపోతున్నారు.  ఇక ‘జెర్సీ’తో హిట్ కొట్టిన గౌతమ్ తిన్ననూరి కూడా ప్రస్తుతం అదే పనిచేసారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.  ఆ మద్య మెగా హీరోలు పవన్ కళ్యాన్, రామ్ చరణ్ ఒక మూవీలో నటిస్తే బాగుంటుందని స్వయంగా అభిప్రాయం వ్యక్తం చేశారు.  ఒకానోక ఈవెంట్ లో ఈ విషయం తెలిపారు. ఇప్పటికే  ‘జర్సీ’ మూవీలో నాని చూపిన నటనా ప్రతిభ, గౌతమ్ తిన్ననూరి టేకింగ్‌ చూసి పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నాని కెరీర్‌లో ఇదే ది బెస్ట్ మూవీ అని అభినందిస్తున్నారు.

 

 తాజాగా ఈ కుర్ర డైరెక్టర్ బాబాయ్, అబ్బాయిలు ఇధ్దరినీ టార్గెట్ చేస్తూ ఇద్దరికీ కథ చెప్పారని తెలుస్తోంది.  ఈ యంగ్ డైరెక్టర్‌ రీసెంట్ గా పవన్‌కు స్టోరీ వినిపించారని.. ఆయనకు స్టోరీ లైన్ నచ్చడంతో సినిమా చేద్దాం పవన్ చెప్పినట్లు టాలీవుడ్ గుస గుస. దాంతో పవన్ ని మెప్పించాం కదా అనే ఉత్సాహంలో స్టోరీ డెవలప్ చేసే పనిలో ఆయన నిమగ్నమైనట్లు టాలీవుడ్ టాక్. ఇదే గనక లైన్లోకి వస్తే ఈ కుర్ర డైరెక్టర్ పంట పండినట్లు అంటున్నారు టాలీవుడ్ వర్గం.

మరింత సమాచారం తెలుసుకోండి: