గత కొంత కాలంగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సినిమాలు పెద్దగా ఆదరణ లభించడం లేదు.  లింగా మూవీ నుంచి ఆయనకు వరుస డిజాస్టర్స్ వస్తున్నాయి.  కబాలి, కాలా సినిమాల తర్వాత పెట్టా కాస్త పరవాలేదు అనిపించుకుంది.  స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కించిన ‘దర్బార్ ’ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది.  ఈ మూవీలో రజినీకాంత్, నయన తార నటించారు.  ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా సక్సెస్ కాలేదు.. అయితే తమిళనాట మాత్రం మంచి టాక్ తెచ్చుకుంది. 

 

కాకపోతే పెట్టిన పెట్టుబడులు మాత్రం రాబట్టలేకపోయిందట. తాజాగా దర్భార్ నష్టాలపై దర్శకుడు భారతీ రాజ సూపర్ స్టార్ రజినీకాంత్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు రొమాంటిక్ ప్రేమ‌క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఆయ‌న గ‌త కొంత కాలంగా ర‌జ‌నీని టార్గెట్ చేస్తూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తున్నారు.  గతంలో  ర‌జ‌నీ రాజ‌కీయాల్లోకి రాబోతున్నానంటూ ఓ స‌మావేశాన్ని నిర్వ‌హిస్తే దానిపై ఘాటుగా స్పందించి వార్త‌ల్లో నిలిచారు.  ఇటీవ‌ల ఇటీవ‌ల ర‌జ‌నీకాంత్ న‌టించిన `ద‌ర్బార్` సినిమా జ‌న‌వ‌రి 9న తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌లైన విష‌యం తెలిసిందే.

 

లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన ఈ మూవీ సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసుకుంద‌ని, వంద కోట్ల మార్కుని దాటి వ‌సూళ్ల వ‌ర్షం సాధించిందని తెగ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.  కానీ బయ్య‌ర్స్ మాత్రం న‌ష్టాలొచ్చాయ‌ని ర‌జ‌నీ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఈ వివాదంపై భార‌తీరాజా మండిప‌డ్డారు. 50 కోట్ల‌తో నిర్మించిన సినిమాకు 400 కోట్లు ఎలా వ‌చ్చాయ‌ని, అలా వ‌స్తే మ‌రి 350 కోట్లు ఎవ‌రి జేబుల్లోకి వెళ్లాయ‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు.  గతంలో లింగ సినిమా విషయంలో నష్టపోయిన బయ్యర్లు ఏకంగా ఓ కమిటీ ఏర్పాటు చేసి పోరాటం చేశారు.  ఆ విషయంలో రజినీకాంత్ జోక్యం చేసుకొని గొడవ సర్ధుమనిగేలా చేశారు. ఈ సందర్భంగా భారతీ రాజా డిస్ట్రిబ్యూట‌ర్లు సినిమా కొనే ముందు ఆలోచించాల‌ని, గుడ్డిగా అడిగినంత ఇచ్చేస్తే ఇలాగే వుంటుంద‌ని చుర‌క‌లంటించడం ఆస‌క్తిక‌రంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: