అందరిది ఒక దారి అయితే తనదో దారి అనుకునే వాడే ప్రత్యేకంగా గుర్తించబడతాడు. అప్పటివరకు ఉన్న స్టార్ హీరోలను కాదని యువత మొత్తం ఎందుకు పవన్ కళ్యాణ్ వెంట పడ్డారో ఆలోచిస్తే ఆయన స్టైల్ కే వారంతా ఫిదా అయ్యారని తెలుస్తుంది. కరెక్ట్ గా అప్పుడే కొద్దిగా వెస్ట్రెన్ కల్చర్ అలవాటవుతున్న రోజులవి.. రెగ్యులర్ గా హీరో అంటే పద్ధతిగా ఉండాలి.. మంచి పనులే చేయాలన్న ఆలోచన ఉండేది కాని ఇవన్ని పవన్ కళ్యాణ్ సినిమాల్లో కనిపించవు. 

 

హీరో ఓ చదువురాని మొద్దు.. డిగ్రీ పాసవడానికి ఏళ్లకు ఏళ్లు పడుతుంది.. మరో సినిమాలో హీరో ఓ పనికిరాని చవట.. ఇంట్లో తండ్రి అసలు విలువ ఇవ్వడు. ఇలాంటి కథలతో తీసిన సినిమాలే తమ్ముడు, తొలిప్రేమ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అప్పటి యూత్ కు బాగా ఎక్కిన సినిమాలు ఇవి. అంతేకాదు లవ్ స్టోరీ అంటే అది పవర్ స్టార్ సినిమానే అనేంతగా క్రేజ్ తెచ్చుకున్నాడు. స్టైల్ కు కేరాఫ్ అడ్రెస్ అయిన పవర్ స్టార్ తన సినిమాల్లో మ్యూజిక్ కూడా కొత్తగా ఉండేలా చూసుకుంటాడు. అందుకే పవన్ సినిమాల్లో ప్రతి పాట సూపర్ హిట్.

 

ఇక కాస్టూమ్స్ విషయంలో కూడా పవన్ చేయని ప్రయోగం లేదు. ప్యాంట్ మీద ప్యాంట్ వేసినా.. బటన్స్ లేకుండా ఖాకీఎ డ్రెస్సు వేసుకున్నా అది పవర్ స్టార్ కే చెల్లింది. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి దగ్గర నుండి అజ్ఞాతవాసి వరకు పవర్ స్టార్ తన ప్రత్యేకత చాటుతూ వస్తున్నారు. నేను ట్రెండ్ ఫాలో అవను సెట్ చేస్తా అన్న డైలాగ్ పవన్ కళ్యాణ్ కు పర్ఫెక్ట్ యాప్ట్ అవుతుంది. మళ్లీ పవర్ స్టార్ సినిమాలు చేసి తన ఫ్యాన్స్ ను అలరించాలని చూస్తున్నారు. ఒకేసారి మూడు సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ పై తన సత్తా చాటడానికి వస్తున్నాడు పవన్ కళ్యాన్.

మరింత సమాచారం తెలుసుకోండి: