పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చాలా కాలం తర్వాత బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ రీమేక్‌ తో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇది దిల్ రాజు కి ఎప్పటి నుంచో ఉన్న కల. ఈ కల ఇన్నాళ్ళకి నెరవేరబోతోంది. ఇక  రీసెంట్‌గా సినిమా షూటింగ్ ప్రారంభమై శరవేగంగా షుటింగ్ జరుపుకుంటోంది. ముందుగా ఈ సినిమాలో పవన్‌కు సంబంధించిన సీన్స్‌ ని చిత్రీకరిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాలో పవన్‌కు సంబంధించిన లుక్స్ కూడా లీక్ అయ్యాయి. ఈ నెల 15 వరకు పవన్‌పై అన్ని సన్నివేశాలను చిత్రీకరించేస్తారట. ఆ తర్వాత మిగతా సీన్స్ తెరకెక్కిస్తారని తాజా సమాచారం. ఎలాంటి హడావుడి లేకుండా చక చకా షూటింగ్ జరుపుతున్నారు.

 

మరోవైపు.. సినిమా పేరు కానీ.. ఇందులో పవన్ సరసన.. మరే ఇతర పాత్రల్లో నటించే వారి గురించి ఇంతవరకూ ఎలాంటి అఫీషియల్ న్యూస్ బయటకు రాలేదు. కాకపోతే నివేదా థామస్, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నట్టు మాత్రం చెబుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రిలీజ్ డేట్ మాత్రం ఇదే అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మే-15న ఈ సినిమాని ఖచ్చితంగా రిలీజ్ చేసేయాలని దిల్ రాజు గట్టిగా ఫిక్సయ్యారని తెలుస్తోంది. ఇది సెంటిమెంట్ ప్రకారం అనుకున్నట్టు అర్థమవుతోంది. ఎందుకంటే దిల్ రాజు కి మే నెల బాగా కలిసి వచ్చింది. ఆ నెలలో వచ్చిన సినిమాలన్నీ మంచి హిట్టవ్వడమే కాకుండా రాజు గారికి కాసుల వర్షం కురిపించాయి. అందుకే మే లో ఈ సినిమా రిలీజ్ అని డిసైడయ్యారట.

 

ఈ నేపథ్యంలోనే షూటింగ్‌ కూడా జెట్ స్పీడ్ లో జరుపుతున్నారు. వీలైనంత త్వరలోనే పవన్‌తో షూటింగ్ ముగించేసి మిగతా సీన్స్‌ చిత్రీకరించాలని డైరెక్టర్ అనుకుంటున్నారట. మరోవైపు దిల్‌రాజు ఇటు హీరోను.. అటు వేణును పరిగెత్తిస్తుండటంతో సినిమా స్పీడ్ గా సాగుతోందట. మరి ఈ రిలీజ్‌ డేట్ ఏ మాత్రం వర్కవుట్ అవుతుందో చూడాలి. బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఇప్పటికే బాలీవుడ్, కోలీవుడ్ లో సూపర్ హిట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: