టాలీవుడ్ సినిమా పరిశ్రమకు అనగనగా ఒక ధీరుడు అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నటుడు కమల్ హాసన్ పెద్ద కూతురు శృతి హాసన్, తొలి సినిమాతో భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. సిద్దార్థ హీరోగా తెరకెక్కిన ఈ ఫాంటసీ మూవీ కి రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించాడు. ఇక ఆ తరువాత కూడా పెద్దగా సక్సెస్ లేని శృతికి, ఒక్కసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ రావడం, ఆ సినిమా అప్పట్లో అతి పెద్ద విజయాన్ని అందుకోవడంతో, ఒక్కసారిగా శృతికి టాలీవుడ్ లో అవకాశాలు పెరిగాయి. 

 

ఆ తరువాత కూడా పలువురు స్టార్ హీరోల సరసన పలు సినిమాల్లో నటించిన శృతి మంచి హిట్స్ తో పాటు ఫెయిల్యూర్స్ కూడా చవిచూసింది. ఇక 2015లో సూపర్ స్టార్ మహేష్ ప్రక్కన ఆమె నటించిన శ్రీమంతుడు ఇండస్ట్రీ హిట్ ని కొట్టింది. అయితే అక్కడి నుండి శృతికి టాలీవుడ్ సహా కోలీవుడ్, బాలీవుడ్ లోపలు సినిమాల్లో నటించింది. అయితే వాటిలో తమిళ్ లో అజిత్ హీరోగా తెరకెక్కిన వేదాళం మూవీ సక్సెస్ కొట్టగా, తెలుగులో నాగ చైతన్య హీరోగా వచ్చిన ప్రేమమ్ పర్వాలేదనిపించింది. అయితే ఆ సినిమా ఆమె కెరీర్ కి ఏ మాత్రం హెల్ప్ కాలేదు. అనంతరం సూర్య సరసన ఆమె నటించిన సింగం 3 కూడా  ఫ్లాప్ అవ్వడంతో శృతికి టాలీవుడ్ లో అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయి. 

 

అయితే అదే సమయంలో మరొక్కసారి పవర్ స్టార్ సరసన కాటమరాయుడులో నటించింది శృతి. అయితే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో అంతకముందు వరకు పెనంలో ఉన్న మాదిరిగా సాగిన శృతి మూవీ కెరీర్, ఈ సినిమాతో పూర్తిగా పొయ్యిలో పడ్డట్లైంది. ఇక ఆ తరువాత నుండి చాలా గ్యాప్ అనంతరం ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ సరసన ఆమె క్రాక్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఈ సినిమా ఆమెకు ఇక్కడ ఎంత మేర బ్రేక్ ని అందిస్తుందో చూడాలి....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: