పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా రెండు పార్ట్స్ లో కనిపించి ఒక వైపు మెగా ఫ్యాన్స్ తో పాటు మరో వైపు యావత్ ప్రేక్షకులకి షాకింగ్ ట్రీట్ ఇచ్చారు. అసలు ఇలా పవన్ కనపడింది కొన్ని సెకండ్స్ మాత్రమే అయినా ఆ ప్రభావం సినిమా మీద చాలానే ఉండింది. అప్పటి నుంచి అందరు అన్నయ్య తో కలిసి తమ్ముడు ఫుల్ స్క్రీన్ ఎప్పుడు షేర్ చేసుకుంటారు అని. కాని దానికి సమాధానం అప్పుడు ఇప్పుడు అంటున్నారే తప్ప అందుకు తగిన సమయం రాకపోవడమా లేక అది కార్య రూపం దాల్చకపోవడమా గాని మొత్తానికి మెగా ఫ్యాన్స్ కి ఆ ముచ్చట మాత్రం తీరడం లేదు. కానీ మెగా అభిమానులకి ఒకే ఫ్రేం లో మెగాస్టార్, పవర్ స్టార్ లను చూస్తే మాత్రం ఇక ఫ్యాన్స్ కి వచ్చే పూనకాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

 

అయితే అన్నయ్య తో మల్టీ స్టార్ కంటే విక్టరీ వెంకటేష్ తో ఒప్పుకోవడం నిజంగా పవన్ వ్యక్తిత్వానికి గొప్ప నిదర్శనం. ఇక్కడే పవన్ కళ్యాణ్ కి ఇగో లేదని అర్థం చేసుకోవాలి. విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటించిన సినిమా గోపాల గోపాలా. బాలీవుడ్ లో ఈ సినిమాని తెలుగులో చేయాలనుకున్నప్పుడు బాలీవుడ్ స్థాయిలో మన దగ్గర ఎవరున్నారు అని మేకర్స్ తర్జన భర్జన పడ్డారు. ఈ సినిమాని ముందు సురేష్ బాబు రీమేక్ రైట్స్ కొని వెంకీ ని ఒక హీరోగా అనుకున్నారు. ఆ తర్వాత శ్రీ కృష్ణుడి పాత్రకి ఎవరిని తీసుకుందామని ఆలోచిస్తూ పవన్ కళ్యాణ్ అయితే బావుంటుందని అడగగానే వెంకటేష్ తో కలిసి నటించడానికి వెంటనే ఒప్పుకున్నారు. అసలు ఈ కాంబినేషన్ అప్పటి వరకు ఎవరూ ఊహించలేదు. నిజంగా ఈ సినిమా అటు వెంకీ కి గాని ఇటు పవన్ కళ్యాణ్ కి గాని గొప్ప సినిమా అని చెప్పాలి.

 

ఇక పోతే ఈ సినిమాకోసం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం అందరికి ఆశ్చర్యాన్ని కలుగచేసింది. మొదటిసారి శ్రీ కృష్ణుడి పాత్ర పోషిస్తుండటంతో ఆ పాత్ర కోసం చాలా కష్టపడ్డారు. ఒక్కోసారి పాత్రలో లీనమయ్యి ఆ మూడ్ లో నుంచి బయటకి రాలేకపోయోవారు. కొన్ని సందర్భాలలో ఆ పాత్ర తాలూకు స్వభావంతో షూటింగ్ నుండి వెళ్ళిపోయోవారట. ఇక ముఖ్య విషయం ఏమిటంటే ఈ పాత్ర కోసం మేకప్ వేసుకున్నన్ని రోజులు కేవలం గ్లాసు పాలు, రెండు అరటి పండ్లని మాత్రమే తీసుకునేవారట. ఇలా ఎందుకని అడిగితే చాలా తక్కువ సార్లు ఎంతో అద్భుతమైన పాత్రలు గొప్ప పాత్రలు మన దగ్గరికి వస్తాయి. అలాంటప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా పని చేయాలని అని చిన్న నవ్వుతో సమాధానమిచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: