పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ మూవీస్ లిస్ట్ లో ఖచ్చితంగా ఉండే సినిమా గబ్బర్ సింగ్. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కి టాలీవుడ్ లో క్రేజ్ ని పదింతలు చేసింది. ఈ సినిమా రిలీజైన రెండవరోజు నుంచే అన్ని థియోటర్స్ ని ఆక్యుపై చేసింది. ఇంత బ్లాక్ బస్టర్ మూవీని హరీష్ శంకర్ డైరెక్ట్ చేశాడు. హరీష్ శంకర్ కి ఈ సినిమా డైరెక్టర్ గా మంచి స్టార్ డం ని తెచ్చింది. రవితేజ మిరపకాయ్ తర్వాత హరీష్ శంకర్ పవన్ డైరెక్ట్ చేయడం ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ గా మారింది. అసలు పవన్ హరీష్ కి చాన్స్ ఎలా ఇచ్చాడు అంటూ కొందరు కామెంట్స్ చేశారు.

 

అసలే రీమేక్ సినిమా. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ కి అఫీషియల్ గా ఈ సినిమాని రీమేక్ చేశారు. చుల్ బుల్ పాండే గా సల్మాన్ పిచ్చ కామెడీని పండించాడు. మాస్ ఎలిమెంట్స్ తో కామెడి ఎంటర్‌టైనర్ గా రూపొందించిన ఈ సినిమా సల్మాన్ ఖాన్ కి భారీ కమర్షియల్ హిట్ ని తీసుకువచ్చింది. అందుకే ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలనుకొని ఆ కథ పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకు వెళ్ళారు. కథ కథనాలు బాగా నచ్చిన పవన్ తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేయమని హరీష్ శంకర్ కి సూచించారు. దాంతో హరీష్ అద్భుతంగా స్క్రిప్ట్ ని మలిచాడు. టైటిల్ కార్డ్ లో మార్పులు చేర్పులు హరీష్ శంకర్ అని వేసుకున్నట్టుగా చక్కగా తెరకెక్కించాడు.

 

ఇక ఈ సినిమా కి పవన్ తీసుకున్న స్పాట్ డెసిషన్స్ ఇండస్ట్రీలో చాలామందికి షాక్ ని ఇచ్చాయి. ముందుగా ఈ సినిమా కి డైరెక్టర్ గా హరీష్ శంకర్ ని అనుకోవడం. ఆ తర్వాత తీన్ మార్ సినిమా ఫ్లాపయినప్పటికి బండ్ల గణేష్ చేతిలో ప్రాజెక్ట్ ని పెట్టడం. ఇక ఐరెన్ లెగ్ అన్న ముద్ర ఉన్న శృతిహాసన్ ని హీరోయిన్ గా సెలెక్ట్ చేయడం .. ఇలా పవర్ స్టార్ అన్ని ఎక్స్‌పరిమెంట్స్ చేశారు. అయినా ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ ని క్రియోట్ చేసింది. ఇక ఈ సినిమాకి బండ్ల గణేష్ ని నిర్మాతగా పవన్ అనుకోవడానికి కారణం అంతకుముందు తీన్ మార్ సినిమాని పవన్ తో తీసి లాసయ్యాడు. దానికి పదింతలు లాభాలు చేకూర్చడానికే ఒకరోజు గణేష్ ని పవన్ ఏరా...సినిమా చేస్తావా ..! అని అడిగారట. ఒక్క క్షణం  ఆలోచించకుండా చేస్తాను బాబు అని చెప్పాడటం అంతే గబ్బర్ సింగ్ కి నిర్మాతని చేసి లాభాలు తెచ్చి పెట్టారు పవన్ కళ్యాణ్. అందుకే గణేష్ కి పవన్ దేవుడు అని చెబుతుంటాడు.   

మరింత సమాచారం తెలుసుకోండి: