టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం పూరి జగన్నాధ్ ఒక్కరు మాత్రమే. ముందు నుంచి మొండి ధైర్యంతో ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కథ రాశాడంటే బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే. ఆ రేంజ్ హిట్స్ ని పూరి ఇండస్ట్రీకిచాడు. ఆయన హీరోలని చూస్తే ఆయన్ని చూసినట్టే ఉంటుంది. పూరి బయట ఎలా మాట్లాడతాడో ఎలా ప్రవర్తిస్తాడో దాదాపు సినిమాలలో పూరి హీరోలు కూడా అలానే ప్రవర్తిస్తుంటారు. ఒక్కసారైనా పూరి డైరెక్షన్ లో సినిమా చేయాలనుకునే హీరోలు మన తెలుగు ఇండస్ట్రీలోనే కాదు హిందీ, కన్నడ ఇండస్ట్రీలల్లోనూ ఉన్నారు. అందుకు తగ్గట్టే పూరి బాలీవుడ్ లో బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో బుడ్డా సినిమాని తక్కువ బడ్జెట్ లో తీసి సూపర్ హిట్ ని అందుకున్నారు. ఇక కన్నడ లోను ఇడియట్ సినిమాని తీసి బ్లాక్ బస్టర్ ని దక్కించుకున్నాడు.

 

పూరి సినిమాలలో హీరోయిజం ఉంటుంది. హీరోలకి ఒక మానరిజం ఉంటుంది. ఇక పూరి రాసే డైలాగ్స్ అయితే జీవితాంతం గుర్తుండి పోవాల్సిందే. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకవుద్దో ఆడే పండుగాడు, నీకంటే తోపెవడు లేడిక్కడ, ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను ..ఇలా చెప్పుకుంటే పూరి డిలాగ్స్ కోసం ఒక పుస్తకమే రాయొచ్చు. అలాంటి పూరి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి బద్రి, కెమెరా మాన్ గంగ తో రాంబాబు సినిమాలతో రెండు సూపర్ హిట్స్ ని ఇచ్చాడు. ఇప్పటికీ ఈ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడా అంటు అటు పవన్ ఫ్యాన్స్ ఇటు పూరి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 

 

ఇదిలా ఉంటే మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీకి ముందు నుంచే అన్నయ్య మెగాస్టార్ తో సినిమా చేయడానికి పూరి పవన్ హెల్ప్ అడిగారట. ఒకసారి రికమెండ్ చేస్తే అన్నయ్యతో కి బ్లాక్ బస్టర్ ఇస్తానని మాటిచ్చాడట. వాస్తవంగా ఇప్పటికే పూరి డైరెక్షన్ లో మెగాస్టార్ ఆటో జాని అనే సినిమా చేయాల్సింది. కాని కథ లో సెకండాఫ్ అన్నయ్యకి తృప్తిగా అనిపించక ప్రాజెక్ట్ పెండింగ్ లో పడింది. అందుకే ఇంకోసారి అన్నయ్య తో సినిమాకి హెల్ప్ చేయమని పూరి అడిగాడట. అయితే అది పవర్ స్టార్ కి నచ్చలేదట. ఇండస్ట్రీలో నీకున్న దమ్ము ధైర్యం ఇంకెవరికైనా ఉన్నాయా ..నీకు నేను రికమెండ్ చేయడమేంటి అంటు చిన్న నవ్వుతో పూరికున్న స్టామినాని చెప్పు భుజం తట్టి అన్నయ్యతో నువ్వే డైరెక్ట్ గా మాట్లాడుకో అని చెప్పాడట. చూడండి పవన్ కి పూరి మీద ఉన్న మన్నకం ఎలాంటిదో .. అందుకే ఆయన పవర్ స్టార్.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: