కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలోని వుహాన్ మాంసపు మార్కెట్ నుండి ఉద్భవించిన వైరస్ క్రమక్రమంగా తన పరిధిని పెంచుకుని ఇప్పటికే వందలాది ప్రాణాలను బలితీసుకుంది. కొన్ని వేల మంది దీని బారీనపడగా.... శాస్త్రవేత్తలు దీనికి మందు ఎప్పుడు కనిపెడతారు అన్నది ఎవరూ చెప్పలేని పరిస్థితి. బ్యాక్టీరియా వల్ల వచ్చే రోగాలకు యాంటీబయోటిక్స్ గంపెడు దొరుకుతాయి కానీ వైరస్ వల్ల వచ్చే రోగాలకు మాత్రం మందులు తయారు చేయడం అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే సెకండ్ కి ఒక రూపం మార్చుకునే వైరస్ లను కంట్రోల్ చేయడం చాలా కష్టమైన పని. దీనికి శాస్త్రవేత్తలను కూడా నిందించలేం.

 

అయితే శాస్త్రవేత్తలు కరోనా విషయంలో మొట్టమొదటిసారిగా ప్రజలకు ధైర్యం ఇచ్చే ఒక విషయాన్ని వెల్లడించారు. తాము సంవత్సరాల తరబడి చదివిన డిగ్రీలు మరియు ఏళ్ళకొద్దే కొద్దీ పరిశోధనలు చేసిన అనుభవం కన్నా కూడా దేవుడు దయతలిస్తే కరుణ వైరస్ అంతు వెంటనే చూడవచ్చు అని చెబుతున్నారు. అదేంటి... విషయంలో దేవుడు చేయగలిగినది ఏమిటి అని ఆలోచిస్తున్నారా? ఒక సినిమాలో "బలహీనత లేని బలవంతుడిని ఇప్పటివరకూ దేవుడు సృష్టించలేదు" అన్నట్లు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలకే సవాల్ విసురుతున్న కరోనా వైరస్ కు కూడా ఒక బలహీనత ఉంది.

 

ఎన్నో వినుత లక్షణాలు కలిగిన మాయదారి వైరస్ అధిక ఉష్ణోగ్రతలకు తట్టుకోలేదని శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో గమనించారు. కాబట్టి వీలైనంత త్వరగా ఎండాకాలం వస్తే వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకే క్రమంలో ఎండ తాకిడికి తట్టుకోలేక మధ్యలోనే మరణిస్తుందని శాస్త్రవేత్తలు ఒక నిర్ధారణకు వచ్చారు. అలాగే అధిక ఉష్ణోగ్రతల కు తగ్గట్లు మన శరీరం తనను తాను మార్చుకున్న తరుణంలో కూడా వైరస్ కు శరీర ఉష్ణోగ్రతలు మరియు వాతావరణం ఏమాత్రం ఆశాజనకంగా ఉండవట. కాబట్టి వీలైనంత త్వరగా వేసవికాలం వచ్చి మండుటెండలు కాయలని అంతా దేవుడిని ప్రార్థిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: