ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ అయినా కూడా వీలైంతగా సన్నగా తయారవడానికి నానా తంటాలు పడుతుంటారు. సన్నజాజి నడుంతో జీరో సైజ్ మేయిన్‌టైన్ చేయడం అంటే నా సామిరంగా వీళ్ళు పడే పాట్లు ఆ దేవుడికే తెలుస్తుంది. సిల్వర్ స్క్రీన్ మీత తమ సత్తా చాటేందుకు హీరోయిన్లు ఎంత కష్టపడతారో..నచ్చిన తండి తినలేక ఎన్ని ఇబ్బందులు పడతారో తెలిస్తే పాపం అంటూ జాలిపడాల్సిందే. తినే కాత తిండిని కూడా.. క్యాలరీలు కరిగించుకునేందుకు గంటల కొద్దీ సమయాన్ని జిమ్ లో కష్టపడటమే కాదు.. రక రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అలాంటిది సన్నజాజి నడుముతో నాభి అందాన్ని ఏరగా వేసే ఈ బక్కపల్చటి బ్యూటి ఇప్పుడు బొద్దుగుమ్మగా మారేందుకు పడుతున్న పాట్లు చూస్తే అలా షాకవుతు కూర్చోవాల్సిందే.

 

సినిమాలో తనకు వచ్చిన పాత్రకు న్యాయం చేసేందుకు ఈ మధ్య కాలంలో హీరో, హీరోయిన్లు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. గతంలో ఒక పాత్ర కోసం ఇంతగా శ్రమించేవారు కాదు. కానీ.. నటీనటుల మధ్య పోటీ బాగా పెరగడంతో శ్రమ కూడా బాగా పెరిగింది. ఇప్పుడు కృతి సనన్ కూడా ఇలానే ఇబ్బంది పడుతోందట. సన్నగా మెరుపు తీగ అందంతో ప్రేక్షకులను కట్టి పడేసేందుకు ఈ బ్యూటి తెలుగులో చేసింది తక్కువే. కానీ బాలీవుడ్ లో మాత్రం క్రేజ్ ని సంపాదించుకొని సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తున్న ఆమెకు తాజాగా ఒక మరాఠీ మూవీలో ఛాలెంజింగ్ రోల్ వచ్చిందట.

 

'మాలా ఐ వైచై అన్న' మరాఠా సినిమాని హిందీలో తీస్తున్నారు. ఈ సినిమాలో ముందు డాన్సర్ గా.. సినిమా క్లైమాక్స్ కి సరోగసి తల్లిగా కనిపిస్తుందట. ఈ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేయడం కోసం ఈ బక్కపల్చటి బ్యూటి బొద్దుగా తయారయ్యేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం తను ఉన్న బరువుకు ఏకంగా పదిహేను కేజీలు పెరిగేందుకు ప్లాన్స్ వేసుకొని మరీ లావు అయ్యే ప్రక్రియని మొదలు పెట్టింది.

 

24/7 జిమ్ లో వర్క్ వుట్ చేసే కృతి.. అవన్ని ఆపేసి ఎడా పెడా ఫుల్ గా లాగించేస్తోంది. పొద్దున్నే ఏ హీరోయిన్ కూడా తినని పూరీ.. శనగల కర్రీతో పాటు.. హల్వానూ అడ్డ దిడ్డంగా కుమ్మేస్తుందట. ఇంకా చెప్పాలంటే రోజుకు లెక్క లేనన్ని సార్లు ఇంతా అంతా అని కాకుండా చూసే వాళ్ళకే చీ అని అసహ్యం వేసేలా తింటుందట. త్వరగా లావు కావాలని విపరీతంగా ప్రయత్నిస్తోందట. ఈ విషయం తెలిసిన తర్వాత సోషల్ మీడియాలో కృతి సనన్ మీద నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రపంచంలో ఇలాంటి ఫుడ్ తినే ప్కే ఒక్క హీరోయిన్ నువ్వు మాత్రమే అంటూ కామెంట్స్ చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: