పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘పింక్’ రీమేక్ షూటింగ్ స్పాట్ నుండి పవన్ చెప్పిన ఒక డైలాగ్ వీడియో లీక్ వెనుక మరొక కోణం ఉందా అంటూ ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ‘పింక్’ రీమేక్ షూటింగ్ కు సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఇప్పటి వరకు ఈ మూవీ నిర్మాతలు ఇవ్వలేదు. 

కేవలం పవన్ కళ్యాణ్ లాయర్ గెటప్ లో నడుస్తున్న ఫోటోలతో పాటు లేటెస్ట్ గా పవన్ చెప్పిన డైలాగ్ లీక్ అయ్యాయి. దీనితో ఈ మూవీ షూటింగ్ ఎక్కడ జరుగుతోందో కూడ తెలియకుండా అతి రహస్యంగా తీస్తున్న ఈ మూవీ షూటింగ్ స్పాట్ నుండి ఇలా ఫోటోలు వీడియోలు ఎలా లీక్ అవుతాయి అంటూ చాలామంది సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. 

వాస్తవానికి ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు ఎక్కడ ప్రారంభం అయింది అన్న విషయం పై క్లారిటీ లేకపోయినా ఈ మూవీని మే 15న విడుదల చేస్తున్నట్లు దిల్ రాజ్ నుండి ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు లీకులు వస్తున్నాయి. దీనితో ఈ మూవీ షూటింగ్ చాల స్పీడ్ గా జరుగుతోంది అన్న సంకేతాలు వస్తున్నాయి. 

ఈ సంకేతాలు నిజం అని తెలియచేయడం కోసమే ఈ మూవీ నిర్మాతలు వ్యూహాత్మకంగా ఇలా ఫోటోలను వీడియోలను లీక్ చేసి ఉంటారు అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు. దీనికితోడు ఈ సినిమాకు చాల పెద్ద స్థాయిలో బిజినెస్ చేయాలి అన్న తలంపులో దిల్ రాజ్ ఉన్న నేపధ్యంలో ఈ లీకులు కూడ ఆ భారీ బిజినెస్ ను దృష్టిలో పెట్టుకుని మాత్రమే అంటూ మరికొందరు ఈ లీకులు వెనుక వేరే కోణం ఉంది అంటూ విశ్లేషిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతున్నా ఈ మూవీ టైటిల్ ఏది పెడితే పవన్ కళ్యాణ్ జాతక రీత్యా బాగుంటుంది అన్న విషయంలో ఇప్పుడు లోతైన చర్చలు కొనసాగుతున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: