రాజకీయాల్లో విమర్శలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఒక పార్టీ నాయకుడిని, మరో పార్టీ నాయకుడు, పార్టీ కార్యకర్తలని మరో పార్టీ కార్యకర్తలు, కింది కింది నుండి మొదలెడితే పై వరకూ విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. అయితే ఆ విమర్శలు సహేతుకమైనవి, విధానపరమైనవి అయితే బాగానే ఉంటుంది. కానీ ఈ మధ్య మనం చూస్తున్నట్టయితే విమర్శలన్నీ వ్యక్తిగత విమర్శలే కనిపిస్తున్నాయి. విధానపరంగా విమర్శిస్తే కూడా వ్యక్తిగత దూషణలకి వెళ్ళిపోతున్నారు. 

 

 

పార్టీ వారైనా వ్యక్తిగత దూషణ చేయడం కరెక్ట్ కాదు. ఈ మధ్య వైసీపీ లీడర్ టీడీపీ నాయకురాలయిన అనురాధపై చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. ఒక మహిళ అని కూడా చూడకుండా ఆయన మాట్లాడిన మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయి. రాజకీయాల్లో విమర్శించినంత మాత్రాన వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేస్తూ వారి వ్యక్తిత్వ హననం చేయడమ్ అనేది విపరీత ధోరణిని సూచిస్తుంది.

 

 

 

అనురాధా గారిని వైసీపీ లీడర్ చేసిన కామెంట్లు ఆమె పర్సనల్ క్యారెక్టర్ ని ఇబ్బందిపడేలాగా ఉన్నాయి. నీ గురించి విజయవాడలో అందరికీ తెలుసు, నీ గురించి నీ భర్త ఎవరితో గొడవపడ్డాడో మాకు తెలియదా.. అని, చంద్రబాబు ప్రాపక కోసమే నువ్వు ఇలా చేస్తున్నావని చెప్పడం, మీ నాన్నకి అన్ని డబ్బులు ఎలా వచ్చాయో మాకు తెలుసు అంటూ మాట్లాడటం కలకలం రేపుతుంది.

 

 

ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తూ, పార్టీని ముందుడి నడిపించాల్సిన నాయకులు కూడా ఒక మహిళ అని చూడకుండా వ్యక్తిగత దాడికి దిగి, దిగజారుడు స్వభావంతో క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని వాదిస్తున్నారు. రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా సమస్య ఉండదు. కానీ విమర్శలన్నీ వ్యక్తిగతంగా ఒకరి మీద ఒకరు చేసుకుంటూ జనాల్లో వాళ్ళెంటన్నది చూపిస్తున్నారు. దీనివల్ల భవిష్యత్ లో వారికే నష్టం వస్తుందని వారు ఊహించట్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: