ఈసారి సంక్రాంతిని కుటుంబ పండగలా కాకుండా అల.. వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు అనే రెండు సినిమాల మధ్య పోటీగా, ఇద్దరు హీరోల మధ్య స్టామినాగా, సినిమా రికార్డుల పోటీగా మారిపోయింది. పోటాపోటీ పోస్టర్లు, అంకెలు పెంచేస్తూ ఫిగర్లు, ఇండస్ట్రీ హిట్ – బ్లాక్ బస్టర్ హిట్లంటూ ఊకదంపుడు వాయింపులు, అదిరిపోయే ఫంక్షన్లతో హోరెత్తిపోయింది. దీంతో ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయితే. ఇద్దరు హీరోల అభిమానులను సోషల్ మీడియాలో తిట్టుకున్నారు. దీనిపై సినీ, రాజకీయ విమర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ తనదైన శైలిలో స్పందించారు.

 

 

‘మా హీరోనే గొప్ప.. కాదు మా హీరోనే గొప్ప, మా సినిమా ఇంత చేసింది.. కాదు మా సినిమా ఇంకా ఎక్కువ చేసింది, మా సినిమా బ్లాక్ బస్టర్ హిట్.. కాదు మా సినిమా ఇండస్ట్రీ హిట్.. ఏంటిదంతా.. రెండు సినిమాలు బాహుబలి తర్వాతే కదా.. బాహుబలి కంటే ఎక్కువ చేస్తే అప్పుడు మాట్లాడండి.. వాళ్లిద్దరూ బాగానే ఉన్నారు.. మీరెందుకు కొట్టుకుంటున్నారు’ అంటూ సెటైర్లు వేస్తునే ఇరు హీరోల ఫ్యాన్స్ తోపాటు మహేశ్, బన్నీలకూ రెండు తగిలించారు. తమ్మారెడ్డి చెప్పినదాంట్లో తప్పేమీ లేదు. తమ సినిమా హిట్ అని, ఇంత చేసిందని చెప్పుకోవడంలో తప్పులేకపోయినా లేనిపోని పోటీలకు పోవడమే నవ్వులపాలైందన్నది నిజం. గతంలో ఎప్పుడూ లేనిది ఈసారి జరిగిందనే చెప్పాలి.

 

 

రాజకీయాలపై కూడా స్పందిస్తూ.. సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబును ఏకిపారేశారు. అసెంబ్లీలో తిట్టుకుంటూ రాష్ట్ర పరువును రోడ్డున పడేశారని మండిపడ్డారు. వైసీపీపై రెండు ఎక్కువే వేశారు. ప్రజలు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసుకుంటున్నారని జగన్ తీరుపై మండిపడ్డారు. తాను ఏ పార్టీకి కొమ్ముకాయటం లేదని ఓ కామన్ మ్యాన్ గా మాత్రమే స్పందిస్తున్నానని చెప్పుకొచ్చారు. కామన్ మ్యాన్ కొడితే ఇలానే ఉంటుందని ఆ మాటల ద్వారా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: