షకీలా ఈ పేరు వినగానే శృంగార చిత్రాలు గుర్తుకు వస్తాయి..  తన సినీ కెరియర్ ఆరంభంలో సాఫ్ట్‌కోర్ పోర్న్ సినిమాల్లో నటించిన షకీలా బి-గ్రేడ్ మలయాళ సినిమాల్లో నటిగా ఆమె సినీ జీవితం ప్రారంభమైంది.. ఈమె నటించిన మొట్టమొదటి సాఫ్ట్ పోర్న్ చిత్రం ప్లేగర్ల్స్, ఇందులో సహాయక నటి పాత్ర పోషించింది. ఇక తెలుగులో తేజ దర్శకత్వం వహించిన జయం సినిమాలో ఫస్ట్ టైం నటించిన షకీలా తన ఇమేజ్ క్రమ క్రమంగా పెంచుకుంటూ పోయింది. ఇలా చాలా తెలుగు సినిమాల్లో బోల్డ్ క్యారెక్టర్స్ చేసి కుర్ర కారును తనవైపుకు తిప్పుకుంది.

 

 

ఇక ఒక నటిగా గుర్తింపు తెచ్చుకున్న షకీలా నిర్మాతగా మారి తీసిన చిత్రం సెన్సార్‌ ఆఫీసులో దుమ్ముపట్టి పోతుందని ఈ మద్య వార్తల్లో వాపోయింది.. తాను ఎంతో కష్టపడి నిర్మించిన 'లేడీస్ నాట్ అలౌడ్' సినిమా పది నెలలుగా సెన్సార్ అవడం లేదు. ఎంతో వల్గారిటీతో వచ్చిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ మా సినిమాకే సెన్సార్ వాళ్లు ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారని మొత్తుకుంటున్నా ఎవరు కరుణించడం లేదట.

 

 

ఇదిలా ఉండగా ఇప్పటివరకు తనలోని రెండు కోణాలను చూపించిన షకీలా ఇంతవరకు ఎవరు తనని గమనించని విధంగా మరో యాంగిల్లో బయటకు వస్తుందట.. అదేమంటే ఈ శృంగార తార రచయితగా అవతారం ఎత్తిందట. తాజాగా ఒక సినిమాకు రచన సహకారం అందించింది. ఆ సినిమా పేరు కూడా విచిత్రంగా ‘షకీలా రాసిన మొట్ట మొదటి కుటుంబ కథా చిత్రం’ అంటూ టైటిల్‌ పెట్టారు. ఆ టైటిల్‌తోనే ఆ కథను ఆమె రాసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్పకనే చెప్పారు.

 

 

నిర్మాతగా నష్టపోయిన షకీలా రచయిత్రిగా ఏమైనా లాభాన్ని దక్కించుకుంటుందో చూడాలి. ఇకపోతే షకీలా కీలక పాత్రలో ఈ సినిమాలో నటించిందట. ఒక తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ చిత్రాన్ని డబ్‌ చేసి విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట.  మరి ఈ సినిమాతో అయినా షకీలా గట్టెక్కుతారో లేదో చూడాలనుకుంటున్నారట ఈ విషయం తెలిసిన సినిమా అభిమానులు..

మరింత సమాచారం తెలుసుకోండి: