సినిమా తీయడం ఎంత ఇంపార్టెంటో దాన్ని ప్రమోట్ చేయడం కూడా అంతే ఇంపార్టెన్స్. వారానికి రెండు నుండి మూడు సినిమాలు విడుదల అవుతున్న నేపథ్యంలో మా సినిమా విషయమ్ ఉంది అని చెప్పడానికి, ప్రేక్షకులకి ఆసక్తి కలిగించడానికి ప్రమొషన్స్ తప్పనిసరి.  కొన్ని సార్లు సినిమాలు బాగున్నా ప్రమోషన్లలో వెనకబడి అవి కలెక్షన్ల మీద ప్రభావం చూపిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

 

 

 

మొన్నటికి మొన్న మెగాస్టార్ చిరంజీవి నటించిన పాన్ ఇండియా చిత్రమైన సైరా సినిమాకి ప్రమోషన్లు చేయకపోవడం వల్లనే బాలీవుడ్ లో దెబ్బ పడిందని చాలా మంది నమ్ముతున్నారు. అయితే టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రమోషన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. వినూత్నమైన ఆలోచనలతో ప్రేక్షకులకి సినిమా మీద ఆసక్తి కలిగించడంలో దిట్ట. నోటా' చిత్రం ఫ్లాప్‌ అయ్యే సూచనలు బలంగా వున్నాయని తెలిసినా కానీ విజయ్‌ దేవరకొండ బాగా ప్రమోట్‌ చేసి ఓపెనింగ్స్‌ తెచ్చాడు. 

 

 

 

టాక్సీవాలా చిత్రం అన్నాళ్లు విడుదల కాకుండా ఆగిపోయినా కానీ విజయ్‌ చొరవ తీసుకుని ప్రమోషన్లతో నిలబెట్టాడు. ఇక డియర్ కామ్రేడ్ సమయంలో ప్రమోషన్స్ ని పీక్స్ లోకి తీసుకెళ్ళాడు. అయితే ఆ సినిమా ఫ్లాప్ అవడంతో విజయ్ చల్లబడ్డట్టు తెలుస్తుంది. తన సినిమాకి అంచనాలు పెరిగిపోతుండడంతో ఆ అంచనాలని అందుకోలేకపోతున్నామన్న కారణంగా ప్రమోషన్ల మీద దృష్టి పెట్టట్లేదేమో అని అంటున్నారు.

 

 

 

లేక సినిమా మీద నమ్మకం లేక ప్రమోషన్ల మీద ధ్యాస్ పెట్టట్లేదా అనే వాళ్ళు కూడా ఉన్నారు. మరో వర్గం అయితే సినిమా బాగున్నా, బాగాలేకపోయినా ప్రమోషన్లని ఆపడం కరెక్ట్ కాదని భావిస్తున్నారు. సాహో సినిమా అంచనాలని అందుకోలేదని సైరాకి లో ప్రొఫైల్ ప్రమోషన్స్ చేయడం వల్ల ఆ సినిమాకి గట్టి దెబ్బ పడిందని గుర్తు చేస్తున్నారు. మరి సినిమా విడుదలకి పదిరోజులున్న నేపథ్యంలో ఇప్పటికైనా మేల్కొంటాడా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: