ప్రేమించడం మంచి లక్షణం అని మనమంతా గొప్పగా చెప్పుకుంటాం. ప్రేమించడం అనేది మంచి లక్షణం కానే కాదు. అది ప్రతి జీవికీ వుండే చాలా చాలా సహజమైన జీవ లక్షణం. నిజానికి అది ప్రతి జీవి లక్షణం. అయితే ప్రేమకు జాతి లేదు, మతం లేదు, ప్రాంతం లేదు...ఎల్లలు లేనిది ప్రేమ...అలాంటి స్వచ్ఛమైన ప్రేమకు వయస్సుతో సంబంధం లేదని ఆర్యవర్థన్, అను నిరూపిస్తున్నారు. ‘ప్రేమ ఎంత మధురం’ అనే సరికొత్త సీరియల్‌తో జీ తెలుగు మన ముందుకు రాబోతుంది. 

 

`ప్రేమను ప్రేమతో ప్రేమగా ప్రేమిస్తే.. ప్రేమించ బడిన ప్రేమ ప్రేమించిన ప్రేమను ప్రేమతో ప్రేమిస్తుంది`. ఇందులో క‌నిపించేది ఒక ప‌ద‌మే అయినా.. ఎంతో అర్థం ఉంటుంది. అలాగే ప్రేమ ప్రేమని మాత్రమే కోరుకుంటుంది. స్వచ్ఛమైన ప్రేమకు డబ్బు, కులం, మతం, ఆస్తులు, అంతస్తులు లాంటి పట్టింపులు ఉండవు. అలాగే స్వచ్చమైన ప్రేమకు వయస్సు కూడా అడ్డంకి కాదు. ఇలా స్వచ్చమైన ప్రేమకు వయస్సు కూడా అడ్డంకి కాదు. ఇదే కాన్సెప్ట్‌తో రూపొందించిన సీరియల్‌ "ప్రేమ ఎంత మధురం". ఈ సీరియ‌ల్‌కు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కూడా ప్ర‌మోట్ చేశారు. 

 

అయితే మహేష్ ప్రమోట్ చేసిన ఈ సరికొత్త ధారావాహిక వచ్చే ఫిబ్రవరి 10 ప్రతీ సోమవారం నుంచి శనివారం  రాత్రి 9 గంటలకు  ప్ర‌సారం కానుంది. 40 ఏళ్ల డైనమిక్‌ బిజినెస్‌మ్యాన్‌ ఆర్యవర్థన్‌. అతనికి బిజినెస్‌, కుటుంబం తప్ప మరో వ్యాపకం లేదు. మరోవైపు అను. వయసు 19 సంవత్సరాలు. ఎప్పుడు ఆడుతూ, పాడుతూ ఉండే చలాకీ పిల్ల. తన చిన్న ప్రపంచమే ఆమెకు లోకం. ఆర్యవర్థన్‌, అను.. విభిన్న మనస్తత్వాలు కలిగిన వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది, వీరి ప్రేమకు వయస్సు అడ్డంకి కాలేదా, అసలు వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టడానికి కారణం ఏంటి..? ఇదే కాన్సెప్ట్‌తో జీ తెలుగు ద్వారా మీ ముందుకు రాబోతుంది ప్రేమ ఎంత మధురం సీరియల్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: