తెలుగు బుల్లితెరపై ఇప్పటి వరకు ఎంతో మంది ఫిమేల్ యాంకర్లు తమ యాంకరింగ్ తో సత్తా చాటారు.  మొదటి సారిగా మెయిల్ యాంకర్ గా తనదై ముద్ర వేసుకున్నాడు ప్రదీప్ మాచినేని.  మొదటి నుంచి ప్రదీప్ తనదైన డిఫరెంట్ మానరీజంతో ప్రతిఒక్కరినీ తనదైన పంచ్ లు వేస్తూ కడుపుబ్బా నవ్విస్తున్నారు.  తాజాగా  సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ నిబంధనలకు విరుద్ధంగా రెండు రోజుల జైలు శిక్ష అనుభవించిన ప్రదీప్‌ ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నారని ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధమని ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో  దర్శకుడు  శ్రీరామోజు సునిశిత్‌  ఫిర్యాదు చేశారు.  దర్శకుడి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.  

 

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ప్రదీప్ కౌన్సిలింగ్ తీసుకున్నారన్న వార్త అందరికీ తెలిసిందే కాని.. ఈ అమ్మాయిని వేధించిన కేసు ఏంటి? పైగా జైలుకు వెళ్లడం ఏంటని? ఆ దర్శకుడు ఎవరు? ప్రదీప్‌తోపై ఎందుకు కేసు పెట్టాడని హాట్ టాపిక్ నడుస్తున్న సందర్భంలో యాంకర్ ప్రదీప్ స్పందించారు. ఓ అమ్మాయిని వేధించాననే వార్తలను ప్రదీప్ కొట్టిపారేశాడు. తానూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కౌన్సిలింగ్ కు హాజరైన మాట వాస్తవమేనని, ఆ విషయం అందరికీ తెలిసిన విషయమేనని కూడా ప్రదీప్ వెల్లడించాడు. కానీ నా లైఫ్ లో నేను ఏ అమ్మాయిని వేదించలేదు.. లైంగికంగాఇబ్బంది పెట్టలేదు. 

 

అలా చేసి ఉంటే నా కెరీర్ ఇంత వరకు వచ్చి ఉండేది కాదని తెలుసుకోండి.. అంటు ఆవేదన చెందారు. ఓ అమ్మాయిని వేధించాని తనపై ఆరోపణలు చేసిన ఆ దర్శకుడు ఎవరో కూడా తనకు తెలియదని ఇదంతా ప్రచారం కోసమే చేస్తున్నారని, దయచేసి నిజానిజాలు తెలుసుకోవాలని వార్తలు ప్రచారం చేయాలనీ మీడియాని కోరాడు.ప్రదీప్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రదీప్ సరసన అమృత అయ్యర్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్‌లను యంగ్ హీరో రానా దగ్గుబాటి రిలీజ్ చేయగా, మొదటిపాటను మహేష్ బాబు రిలీజ్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: