ప్రస్తుతం బాలీవుడ్ లో మెరిసిపోతున్న మెరుపు తీగలాంటి హీరోయిన్లలో దిశా పటాని మొదటి వరుసలో ఉంటుంది. నాజూకైన నడుము వంపులతో, సన్నని బాడీ ఫిజిక్ తో స్టన్నింగ్ బ్యూటీ అనదగ్గ క్వాలిటీస్ అన్నీ దిశా పటానిలో ఉన్నాయి. సమ్మోహనపరిచే అందం ఆమె సొంతం. ఎప్పుడూ బికినీల్లో మెరిసే ఈ భామ ఇలియానా తర్వాత అంతటి నాజూకైన నడుము సుందరి అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఆమె నటించిన మలంగ్ సినిమా మరో మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.

 

 

సినిమా ప్రమోషన్లలో భాగంగా సినిమా యూనిట్ రిలీజ్ చేసిన ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ సెన్సేషన్ గా మారింది. ఈ ప్రోమోలో మలంగ్ టైటిల్ సాంగ్ తో రిలీజ్ చేశారు. ఆదిత్య రాయ్ కపూర్అనిల్ కపూర్ యాక్షన్ ఎపిసోడ్ కంటే ఈ ప్రోమోలో దిశా వేసిన బికినీ ట్రీటే యూత్ ని అట్రాక్ట్ చేస్తోంది. బికినీలో పెర్ఫెక్ట్ ఫిగర్ తో చూపు తిప్పుకోలేనంత అందంగా దిశా పటానీ ఈ పాటలో ఉంది. పాట మొత్తం రకరకాల బికినీల్లో సెక్సీగా, స్కిన్ షోతో సెక్సీగా మార్చేసింది. బికినీలో అందమంటే ఇలా ఉండాలనేట్టుగా ఉంది. గంటల్లోనే లక్షల వ్యూస్ తో ఈ పాట యూట్యూబ్ లో దూసుకుపోతోంది.

 

 

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన లోఫర్ సినిమాలో నటించిన దిశా పటాని అటు తర్వాత బాలీవుడ్ లోనే నటిస్తోంది. ఇటువంటి బ్యూటీ అందాలను ముందే పసిగట్టే మన పూరి జగన్నాధ్ ఈమెను ముందే మన టాలీవుడ్ కి తీసుకొచ్చేశాడు. అయితే ఈ సినిమా ఫ్లాప్ కావడంతో మనవాళ్లు దిశా పటానిని లైట్ తీసుకున్నారు. కానీ.. బికినీల్లో, స్విమ్ సూట్లలో ఎప్పుడూ సోషల్ మీడియాలో అట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది. మలంగ్ లో మరెన్ని మెరిపులు మెరిపించిందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: