పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ పింక్ రీమేక్ రీసెంట్ గా మొదలైందో లేదో.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేసుకుంది. అయితే అదే నెలలో.. మరో మెగా సినిమాకు గట్టి పోటీ ఇస్తున్నాడు పవర్ స్టార్. ఒకేసారి వస్తున్న మెగా హీరోల సినిమాలు ఏంటి.. ఎవరు దెబ్బకొడుతున్నారో ఓ సారి పరిశీలిస్తే.. !

 

పవన్ కళ్యాణ్ సినిమా పింక్ లేటుగా మొదలైనా.. షూటింగ్ మాత్రం అనుకున్న టైమ్ లో పూర్తవుతుంది. పవన్ కళ్యాణ్ ఇందులో లాయర్ గా నటిస్తున్నాడు. స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు 80 నుంచి 100 రోజుల వరకు తీసుకుంటారు. కానీ పవన్ 20 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొంటే చాలు.. షూటింగ్ పూర్తయిపోతుందట. దీంతో నిర్మాత దిల్ రాజు టెన్షన్ పడకుండా పవర్ స్టార్ మూవీని మే 15న థియేటర్ లోకి తీసుకొచ్చేస్తున్నాడు.

 

మేలో వస్తున్న మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్. ప్రతీ రోజు పండుగే తర్వాత తేజు నటిస్తున్న సోలో బతుకే సో బెటర్ సినిమాను మే1న రిలీజ్ అవుతోంది. సుబ్బు దర్శకుడు. ఈ మధ్యనే ఫస్ట్ లుక్ తో పాటు.. రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు. 

 

రెండు వారాల గ్యాప్ లో మెగా హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మే 1న సోలో బతుకే సో బెటర్.. మే 15న పింక్ రీమేక్ థియేటర్స్ లోకి వస్తున్నాయి. రెండు వారాల గ్యాప్ లో రావడం.. ఇద్దరికీ పెద్ద సమస్య కాకపోయినా.. మధ్యలో మే9న నేనున్నానంటూ క్రాక్ మూవీతో వస్తున్నాడు రవితేజ. డాన్ శ్రీను.. బలుపు తర్వాత రవితేజ.. గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది. ఈ లెక్కన సమ్మర్ హాలిడేస్ క్యాష్ చేసుకోవడానికి.. ఐదు నెలల ముందే రిలీజ్ డేట్స్ పై కర్చీఫ్ వేసేస్తున్నారు. ఈ క్రమంలో మేలో మొదటి మూడు వారాల్లో వారానికో క్రేజీ మూవీ వస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: