రచయిత కోన వెంకట్ ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడటం జరిగింది. గతంలో డైరెక్టర్ శ్రీను వైట్ల తో చేసిన సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించిన ఆ సమయంలో ఇద్దరికీ మంచి పేరు రావడం జరిగింది. అయితే ఆ తర్వాత శ్రీను వైట్లతో తెగదెంపులు చేసుకున్నాడు కోన వెంకట్. అయితే ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడిన కోన వెంకట్...శ్రీను వైట్ల గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడటం జరిగింది. ఇదే తరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు. మేటర్ లోకి సరిగ్గా ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడు అన్నట్టుగా కోన వెంకట్ కామెంట్ చేశారు.

 

అదే సమయంలో వైసిపి పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆ టైంలో చేసిన పాదయాత్ర ఉద్దేశించి వైయస్ జగన్ లాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే లేడని ప్రజా సమస్యలపై జగన్ కి ఉన్నంత అవగాహన పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబుకు లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాజాగా ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి...రాజకీయాల్లో అనుభవం లేకపోయినా కాని ప్రజా సమస్యల కోసం పవన్ కళ్యాణ్ చాలా పోరాటం చేస్తున్నాడని సమాజంపై ఆయనకున్నంత అవగాహన మరొకరికి లేదని రాజకీయాల్లో చాలా పరిణితి చెందాడు అన్నట్టు కోన వెంకట్ కీలక వ్యాఖ్యలు చేశారు.

 

దీంతో కోన వెంకట్ వ్యాఖ్యలు విన్న పవన్ కళ్యాణ్ అభిమానులు.. సోషల్ మీడియాలో సీరియస్ అయ్యారు. నువ్వు పెద్ద అవకాశవాది వి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆ సమయంలో అలా మాట్లాడి...ఇప్పుడు మా వోడు సినిమా రంగంలోకి రీ ఎంట్రీ అవటంతో అవకాశాలకోసం మాట్లాడటం సిగ్గుచేటు నీకు అవకాశాలు లేక పవన్ కళ్యాణ్ జపం చేస్తున్నావని కోన వెంకట్ కి కౌంటర్ లు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: