గత కొంత కాలంగా సినీ పరిశ్రమలో హర్రర్, కామెడీ జోనర్ లో ఎక్కువగా సినిమాలు వస్తున్నాయి.  హర్రర్ తోపాటు కామెడీ... ఎమోషనల్ కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వస్తున్నాయి.  ఈ మూవీస్ మంచి హిట్ కూడా అవుతున్నాయి. ముఖ్యంగా ముని లాంటి కామెడీ, హర్రర్ కాన్సెప్ట్ తో విజయం అందుకున్న లారెన్స్ వరుసగా కాంచన, కాంచన 3 మూవీస్ తో సూపర్ హిట్ అందుకున్నాడు.  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో  ఈ మద్య ఈ తరహా సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి.  గతంలో హర్రర్ అంటే థియేటర్లో ఒంటరిగా కూర్చోవాలంటేనే భయం భయంగా ఉండేది...అందుకే ఎవరినైనా తోడుగా తీసుకు వెళ్లేవారు. కానీ ఈ మద్య హర్రర్ సినిమాలుంటే కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.

 

అయితే అప్పుడప్పుడు పూర్తి స్థాయిలో భయపెట్టే సినిమాలు కూడా వస్తున్నాయి.  తాజాగా యూరీ, మన్ మర్జయాన్ సినిమాల తరువాత విక్కీ కౌశల్ నటిస్తున్న ‘భూత్: ది హంటెడ్ షిప్’ ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీలో విక్కీ సర్వేయింగ్‌ ఆఫీసర్‌ పృథ్వీగా కనిపించనున్నాడు. భాను ప్రతాప్‌ సింగ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్‌, జీ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఇక ఈ సినిమా ఎంతో భయంకరంగా ఉంటుందని ట్రయిలర్ చూస్తే తెలుస్తోంది. ముంబై తీరానికి ఏ విధమైన ప్రయాణికులు, సిబ్బంది లేకుండా కొట్టుకుని వచ్చిన 'సీ బర్డ్' అనే షిప్ లో ఏం జరిగిందో తెలుసుకునేందుకు పృథ్వీ వెళ్లనున్నాడని ట్రయిలర్ చూస్తే తెలుస్తోంది. 

 

షిప్ లో కొంత మంది భయంకరంగా చనిపోతారు.. వారి ఆత్మలు ఆ షిప్ లో ఇంకా తిరుగుతూనే ఉంటాయి  అయితే ముంబై సముద్రతీరంలో మిస్టరీగా ఉన్న సీ బర్డ్‌ అనే షిప్‌నకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు పృథ్వీ ఒంటరిగా అందులోకి వెళ్లడంతో ట్రైలర్‌ మొదలౌతుంది‌.. సీ బర్డ్‌లో చోటుచేసుకునే భయంకరమైన సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. మొత్తానికి ట్రైలర్ చూస్తే మాత్రం గుండె గుభేల్ అనేలా ఉంది.  ఫిబ్రవరి 21న సినిమాను విడుదల చేయనున్నట్లు పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: