అఖిల్, హలో , మిస్టర్ మజ్ను సినిమాలతో  వరుసగా హ్యాట్రిక్  పరాజయాలను చవిచూసిన  యంగ్ హీరో అఖిల్  అక్కినేని  ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో  తన నాల్గవ సినిమా లో నటిస్తున్నాడు.  గత కొన్ని నెలల నుండి  రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తుది దశకు చేరుకుంది.  తాజాగా ఈ మూవీ టైటిల్ పోస్టర్ ను విడుదలచేసింది చిత్ర బృందం.  ఈసినిమాకు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్  అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.  అయితే  రెండు రోజుల ముందే ఈటైటిల్ లీక్ అయ్యింది.  ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఈనెల 8న సాయంత్రం 6:18 గంటలకు విడుదలచేయనున్నారు. 
 
ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్నఈచిత్రంలో అఖిల్ కు  జోడిగా పూజా హెగ్డే నటిస్తుండగా  గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.  గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ ఫై  బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా  నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదలకానుంది. కాగా  ఫిలిం నగర్ వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం సినిమా బాగానే వస్తుందట.  ముఖ్యంగా పూజా , అఖిల్ కెమిస్ట్రీ ఈ సినిమాలో హైలైట్ అవ్వనుందట.  ఇక గీత గోవిందం,టాక్సీవాలా,ప్రతి రోజు పండగే లాంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన గీతా ఆర్ట్స్ 2 ఈ సినిమాను నిర్మిస్తుడడం అలాగే వరస సక్సెస్ లతో స్టార్ హీరోయిన్ గా మారిన పూజా హెగ్డే ఈ సినిమాలో నటిస్తుండడం తో ఈ చిత్రం పై మంచి అంచనాలే వున్నాయి.  ఇదిలా ఉంటే  ఈచిత్రం పై అఖిల్ భారీ ఆశలే పెట్టుకున్నాడు.  అఖిల్ తోపాటు  డైరెక్టర్  బొమ్మరిల్లు భాస్కర్ కు  కూడా ఈచిత్ర విజయం కీలకం కానుంది.  బొమ్మరిల్లు , పరుగు తరువాత  భాస్కర్ కూడా  ఫామ్ కోల్పోయాడు. మరి ఈ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్  తోనైనా  అఖిల్ , భాస్కర్ హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవుతారో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: