ఈ ఏడాది సంక్రాతి కానుకగా త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో ‘అల వైకుంఠపురములో’ మూవీతో రిలీజ్ అయ్యింది.  మొదటి నుంచి ఈ మూవీపై భారీ అంచనాలే పెరిగిపోయాయి. ముఖ్యంగా ఈ మూవీలో సామజవర గమన, రాములో రాములో పాటలు యూట్యూబ్ రికార్డులు బద్దలు కొట్టాయి.  ఇక కలెక్షన్ల పరంగా గతంలో కన్నా బన్నీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాడు.  ఓవర్సీస్ లో సైతం కొత్త రికార్డు సృష్టించిన బన్ని ప్రస్తుతం గతంలో తనకు ఆర్య లాంటి సూపర్ హిట్ అందించిన సుకుమార్ దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నారు.   ఈ మూవీపై భిన్న కథలు వినిపిస్తున్నాయి.  కాకపోతే ఈ మూవీలో బన్నీమాస్ లుక్ లో డ్రైవర్ గా నటించబోతున్నారని సమాచారం.   

 

అనంతరం ఐకాన్ అనే సినిమాలో కూడా నటించనున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత  బన్నీ చేయబోయే మరొక ప్రాజక్ట్ కూడా నేడు ఓకె అయినట్లు పలు టాలీవుడ్ వర్గాల నుండి వార్తలు అందుతున్నాయి. ఇక వాటి ప్రకారం, మూడేళ్ళ క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన బై లింగ్యువల్ మూవీ స్పైడర్ ని తెరకెక్కించిన ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో బన్నీ అతి త్వరలో ఒక సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.   ఈ ఏడాది రజినీకాంత్ - మురుగదాస్ కాంబినేషన్ లో ‘దర్భార్ ’ మూవీ రిలీజ్ అయ్యింది. 

 

గత ఏడాది సర్కార్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న మురుగదాస్ ‘దర్భార్’ తో ఆ స్థాయిలో హిట్ అందుకోలేకపోయారు.  తమిళనాట కొంత మంది బయ్యర్లు ఈ సినిమా వల్ల నష్టపోయామని అంటున్నారని.. వారి సమస్య పరిష్కరించేందుకు రజినీ స్వయంగా రంగంలోకి దిగారని వార్తలు వచ్చాయి.  ఆ మద్య మురుగదాస్ డైరెక్షన్ లో మహేష్ బాబు నటించిన ‘స్పైడర్’ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. స్పైథ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ కాన్సెప్ట్ ఓకే అయినా జనాలు మాత్రం రిసీవ్ చేసుకోలేక పోయారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: