టాలీవుడ్ సినిమా పరిశ్రమకు దేవదాసు సినిమాతో హీరోయిన్ గా అరంగేట్రమ్ చేసిన గోవా భామ ఇలియానా. అయితే రామ్ సరసన ఆమె నటించిన తొలి సినిమానే మంచి సక్సెస్ సాదించడం, ఆ వెంటనే సూపర్ స్టార్ మహేష్ సరసన ఆమెకు పోకిరి సినిమాలో అవకాశం రావడం, ఎవరూ ఊహించని రేంజ్ లో ఆ సినిమా అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో టాలీవుడ్, కోలీవుడ్ లో ఇలియానాకు విపరీతమైన ఆఫర్లు వచ్చి పడ్డాయి. ఇక తెలుగుతో పాటు అటు తమిళ పరిశ్రమలో కూడా వరుస సినిమాలతో దూసుకెళ్లిన ఇలియానా కొన్ని హిట్స్ తో పాటు ఫ్లాప్స్ కూడా అందుకుంది. అయితే ఆ తరువాత నుండి కొత్త హీరోయిన్ల రాకతో మెల్లగా ఇలియానాకు అవకాశాలు తగ్గాయి. ఇక ఇటీవల కొన్నాళ్ల క్రితం తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్ తో కలిసి కొన్నాళ్ళు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఇలియానా

 

హఠాత్తుగా అతడి నుండి విడిపోయింది. ఇక ఆ తరువాత సినిమాల్లో ప్రయత్నాలు చేసిన ఇలియానాకు హిందీలో మాత్రం మంచి అవకాశాలు దక్కినా అవి పెద్దగా ఫలితాన్ని అయితే ఇవ్వలేదు. ఇక  తరువాత మాస్ రాజా రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో ఆమెకు అవకాశం వచ్చినప్పటికీ, ఆ సినిమా ఘోర పరాజయాన్ని అందుకోవడంతో ఇలియానా టాలీవుడ్ పై పెట్టుకున్న ఆశలన్నీ కూడా పూర్తిగా ఆవిరయ్యాయి. ఇక ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ తో తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా యాక్టివ్ గా ఉంటూ పలు విషయాలు, ఫోటోలు షేర్ చేసే అలవాటున్న ఇలియానా, కొద్దిరోజులుగా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేస్తున్న ఫోటోల పై ప్రస్తుతం ఒకింత భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

 

బికినీ ధరించి, అలానే పలు ఫోజుల్లో బీచ్ ల వద్ద ఇలియానా పోస్ట్ చేస్తున్న ఫోటోలను కొందరు పొగుడుతుంటే, మరికొందరు మాత్రం విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఆమె ఇటీవల పోస్ట్ చేస్తున్న ఫోటోలలో కొన్నిటిని పరిశీలిస్తే అవి ఇప్పుడు దిగినవి కాదని, ఆమె ఒకప్పుడు సన్నగా ఉన్న సమయంలో దిగినవని, ఎందుకంటే ప్రస్తుతం ఇలియానా చాలా బొద్దుగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే కదా, అవకాశాల కోసం ఈ విధంగా చావు తెలివితేటలతో ఒకప్పటి ఫోటోలు పోస్ట్ చేయడం సరైనది కాదని వారు కామెంట్స్ చేస్త్నున్నారు. మరి వీటిపై ఇలియానా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: